Director Shankar: మరో డిగ్రీ ఎక్కువే చదివారు… శంకర్‌ గూస్‌బంప్స్‌ కామెంట్స్‌!

Advertisement

కమల్‌ హాసన్‌ (Kamal Haasan) – శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు 28 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడో వచ్చేసేది. అయితే వివిధ కారణాల వల్ల ఆవుతూ వచ్చింది. ఆ సినిమానే ‘భారతీయుడు 2’ (Indian 2). ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సినిమా ఆడియో ఫంక్షన్‌ను చిత్రబృందం ఇటీవల చెన్నైలో నిర్వహించింది. వేదిక మీద దర్శకుడు శంకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘ఇండియన్’సినిమా టైంలోనే కమల్ హాసన్ సీక్వెల్ తీద్దామని అన్నారట. కానీ అప్పుడు తన దగ్గర సరైన కథ లేదని శంకర్‌ నో చెప్పారట. ఆ తర్వాత చాలా ఏళ్లకు పేపర్స్‌లో లంచాల వల్ల జరిగే ఘోరాలు, అన్యాయాలు చూసి కథ ఇలా రాద్దామా? అలా రాద్దామా? అని అనుకున్నారట. కానీ అప్పుడు కమల్ హాసన్, తాను వేర్వేరు ప్రాజెక్టుల్లో ఉండటంతో కుదర్లేదట. ‘2.0’ తరువాత ఈ కథ రాసుకున్నారట శంకర్‌. అలా ‘ఇండియన్ 2’ మొదలైంది అని చెప్పారు.

మొదటి రోజు షూటింగ్‌లో ఇండియన్ గెటప్‌లో కమల్ హాసన్ చూసి అంతా షాక్ అయ్యారట. 28 ఏళ్ల క్రితం తొలిసారి సేనాపతిని చూసినప్పుడు ఎలా అనిపించిందో.. ఇప్పుడూ అలాంటి ఫీలింగే కలిగిందట. ‘ఇండియన్’ తాత మంచి వాళ్లకు మంచివాడు, చెడ్డవాళ్లకు చెడ్డవాడు. ఇలాంటి పాత్రను చేయడం మామూలు విషయం కాదు. కమల్‌ 360 డిగ్రీ కంటే ఒక డిగ్రీ ఎక్కువగా నటించే సత్తా ఉన్న నటుడు అని శంకర్‌ పొగిడేశారు.

కమల్‌ 70 రోజుల పాటు మేకప్‌తో నటించారు. ఆయన లాంటి నటడు ఈ ప్రపంచంలోనే లేరు. ‘ఇండియన్ 2’ సినిమాను వేరే నిర్మాతతో చేయాల్సింది. అయితే లైకా సుభాస్కరన్ ఫోన్ చేసి ‘నేను ఈ సినిమా నిర్మిస్తాను.. నాకు ‘ఇండియన్’ సినిమా అంటే ఇష్టం’ అని అన్నారట. అయితే నిర్మాణ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయట. అయినా ఆయన ఎంతగానో సపోర్ట్‌గా నిలిచారు అని శంకర్‌ చెప్పారు.

https://www.youtube.com/watch?v=dw5oBv24L1s

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus