కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్ కు ఇతర భాషల్లో కూడా మంచి పేరు, గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ తో భారతీయుడు2, చరణ్ తో ఒక సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కొన్ని నెలల గ్యాప్ లోనే ఈ రెండు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు శంకర్ పెద్ద కూతురు అదితి సినిమా రంగంలో మంచి గుర్తింపును సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
డాక్టర్ చదివిన అదితి సినిమాలపై ఆసక్తి ఉండటంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కూతురు సినిమాల్లోకి రావడం ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో కూతురు సినీ ఎంట్రీకి శంకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అందుతోంది. కార్తీ హీరోగా తెరకెక్కిన విరుమాన్ సినిమాతో ఆమె కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే ప్రస్తుతం అదితి శంకర్ కు శింబు హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ఛాన్స్ దక్కిందని సమాచారం. ఈ సినిమాలో నటించడానికి అదితి కూడా ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.
అయితే శంకర్ మాత్రం శింబుకు జోడీగా అదితి నటించడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని తేల్చి చెప్పారని సమాచారం. శింబు గతంలో పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ కారణం వల్లే శంకర్ తన కూతురికి అలాంటి సూచనలు చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల గురించి శంకర్ లేదా అదితి స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.
సినిమాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోతే డాక్టర్ గా కెరీర్ ను కొనసాగిస్తానని అదితి తండ్రికి మాటిచ్చారని బోగట్టా. అదితి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?