Shankar: సౌత్‌లో రీసెంట్‌గా రిలీజ్‌ అయిన ట్రైలర్‌ ఏంటి? శంకర్‌ ఎవరిని అన్నారు?

సినిమా దర్శకుల్లో తక్కువగా మాట్లాడేది.. భారీ సినిమాలు తీసేది ఎవరు అంటే.. శంకర్‌ (Shankar) పేరు చెబుతుంటారు. ఆయన ఎందుకో కానీ పెద్దగా ఏ విషయం మీద స్పందించారు. ఆయన సినిమాల ప్రచారంలోనూ కామ్‌గానే ఉంటారు. సోషల్‌ మీడియాలో ఉన్నప్పటికీ.. పెద్దగా అన్ని విషయాల్లోనూ స్పందించారు. అలాంటి ఆయన ఇప్పుడు ఓ విషయం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే కాపీ రైట్‌ అంశం. ఇటలీవల విడుదలైన ఓ సినిమా ట్రైలర్‌లో ఓ ముఖ్యమైన సన్నివేశం విషయంలో నాకు అభ్యంతరం ఉంది.

Shankar

ఆ సీన్‌ చూడగానే నాకు చాలా బాధేసింది. నేను హక్కులు తీసుకున్న నవలలోని సన్నివేశాలను సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు.. ఇలా వివిధ రకాల ప్లాట్‌ఫామ్స్‌లో వాడేస్తున్నారు. ఇది సరికాదు. ఇప్పటికేనా వాటిని వినియోగించడం మానుకోండి అని శంకర్‌ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వెంకటేశన్‌ రాసిన తమిళ నవల ‘నవ యుగ నాయగన్‌ వేళ్‌ పారి’ కాపీరైట్స్‌ శంకర్‌ వద్ద ఉన్నాయి.

ఆయన ఆ నవలతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే ఆయన అనుమతి లేకుండా నవలలోని కొన్ని సన్నివేశాలను సినిమాల్లో వినియోగించారట. అలా ఓ ట్రైలర్‌లో సీన్‌ చూసి షాకయ్యారట. అందుకే అలా రియాక్ట్‌ అయ్యారు. శంకర్ పోస్ట్ చూసిన నెటిజన్లు ఇంతకీ నవలలోని సన్నివేశాలను కాపీ కొట్టిన సినిమా ఏది? అని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో రెండు సినిమాల పేర్లు వినిపిస్తున్నాయి.

ఒకటి తారక్‌ (Jr NTR)  – కొరటాల (Koratala Siva) ‘దేవర’ (Devara) కాగా.. రెండోది సూర్య (Suriya) – శివ (Siva) ‘కంగువ’ (Kanguva) . . ఈ రెండూ దాదాపు ఒకేలా ఉన్నాయి. నవల కథాంశానికి దగ్గరగా ఉన్నాయి. దీంతో ఈ ఇద్దరిలో ఒకరి గురించో, లేక ఇద్దరి గురించి శంకర్‌ అన్నారు అని ఓ వాదన వినిపిస్తోంది. అయితే, ఇక్కడ మరోపాయింట్‌ కూడా ఉంది. శంకర్‌ చెప్పింది ట్రైలర్‌. ఇటీవల వచ్చిన ట్రైలర్‌ ‘దేవర’దే. పోనీ ‘కంగువ’ అనుకుందాం అంటే ఆ సినిమా టీజర్‌ వచ్చింది కానీ ట్రైలర్‌ రాలేదు.

 బెంగళూరులో బుకింగ్స్ లో అదరగొడుతున్న దేవర.. కానీ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus