Shiva Nirvana: లిప్ లాక్ పై విలేకరి అడిగిన ప్రశ్నకు డైరెక్టర్ నిర్వాణ ఏమన్నారంటే..!

ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన ఖుషీ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మూవీలో సమంత, విజయ్ దేవర కొండలు ఎలాంటి మ్యాజిక్ చేస్తారా అని ఆశగా ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు తెరపడింది. ఈ మూవీకి ప్రస్తుతం మిక్సడ్ టాక్ నడుస్తోంది. కొందరు సమంత, విజయ్ ల మధ్య కెమిస్ట్రీ బాగుందని కామెంట్ చేస్తున్నారు. కొందరు మాత్రం కథలో కొత్తదనం లేదని పెదవి విరిచేస్తున్నారు. ఎక్కువ మందికి మూవీ నచ్చినట్లు తెలుస్తోంది. టాక్ సంగతి పక్కన పెడితే, ఈ మూవీ విడుదలైన తర్వాత డైరెక్టర్ శివ నిర్వాణ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా విలేకరులు అడిగిన చాలా ప్రశ్నలకు ఆయన (Shiva Nirvana) సమాధానం చెప్పారు. దీనిలో భాగంగా లిప్ లాక్ సీన్స్ గురించి విలేకరులు ప్రశ్నించగా, ఆయన దానికి చాలా కన్విన్సింగ్ గా సమాధానం చెప్పడం విశేషం. ఆయన మాట్లాడుతూ..”ప్రేమా, పెళ్లి, ఎమోషన్ లాంటివి పెట్టినప్పుడు ముద్దు అనే చిన్న ముచ్చట లేకపోతే అర్ధం.. పర్ధం ఉంటుందా? అదీకాక ఆరాధ్య పాత్రకు అది అవసరం అందుకే పాటలో లిప్ కిస్ పెట్టా.

ఇక చూసే ప్రేక్షకులకు వారు నిజమైన కపుల్ అనే ఫీల్ కలగాలి” అంటూ ఆన్సర్ ఇచ్చారు డైరెక్టర్. ఇక, ఆ లిప్ లాక్ సీన్స్ చేసినప్పుడు సమంత, విజయ్ రియాక్షన్ ఏంటి అని మరొకరు అడగగా, తాను యాక్షన్ అని చెప్పగానే వారు చేశారని, కట్ చెప్పగానే సీన్ అయిపోయిందని, అది కూడా పార్ట్ ఆఫ్ వర్క్ మాత్రమే అని చెప్పారు. ఇక, ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రను ప్రముఖ ప్రవచన కర్త చాగంటిని ఉద్దేశించి పెట్టారా అని కూడా ప్రశ్నించారు.

అయితే, ఆ వర్గానికి చెందిన వారిలా ఉండాలని పెట్టానని, కేవలం ఆయననే స్పెషల్ గా ఉద్దేశించి పెట్టలేదని చెప్పారు. ఇక, ఇలాంటి సినిమాను అన్ని వర్గాల వారు ఆదరిస్తారనే నమ్మకంతో తాను ఈ మూవీ చేశానని ఆయన చెప్పారు. మరి లిప్ కిస్ పై డైరెక్టర్ ఇచ్చిన సమాధానం మీకేవిధంగా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus