నాగచైతన్య (Naga Chaitanya) వెంకట్ ప్రభు (Venkat Prabhu) కాంబినేషన్ లో తెరకెక్కిన కస్టడీ (Custody) మూవీ ఒకింత భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ కావడం వల్ల ఫ్లాపైంది. కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమాతో కృతిశెట్టి (Krithi Shetty) ఖాతాలో భారీ ఫ్లాప్ చేరింది. అయితే ది గోట్ (The Greatest of All Time) ప్రమోషన్స్ లో భాగంగా వెంకట్ ప్రభు కస్టడీ సినిమా గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య కస్టడీ, సూర్య మాస్ సినిమాలకు సంబంధించి మొదట తన ఐడియా వేరని తెరకెక్కించిన సినిమా వేరని ఆయన తెలిపారు.
హీరో వైపు నుంచో, నిర్మాతల వైపు నుంచో మార్పులు చేయాలని కోరడంతో స్క్రిప్ట్ లో మార్పులు చేశానని దర్శకుడు చెప్పుకొచ్చారు. నేను చేసిన మార్పుల వల్ల చివరకు సినిమా రిజల్ట్ మారిపోయిందని ఆయన తెలిపారు. నేను నమ్మిన కథతో చేసిన సినిమాలు సక్సెస్ అయ్యాయని దర్శకుడు తెలిపారు. అయితే వెంకట్ ప్రభు (Venkat Prabhu) చేసిన కామెంట్ల గురించి నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కస్టడీ మూవీ హిట్టై ఉంటే దర్శకుడు ఇలాంటి కామెంట్లు చేసేవారా అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. మార్పుల వల్ల సినిమా ఫ్లాప్ అయ్యే పరిస్థితి ఉంటే దర్శకుడు అలాంటి మార్పులు చేయాల్సిన అవసరం ఏముందని కామెంట్లు వినిపిస్తున్నాయి. వెంకట్ ప్రభు కామెంట్లపై నాగచైతన్య ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఒక సినిమా ఫ్లాప్ కావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.
సినిమా ఫ్లాపైనంత మాత్రాన హీరో లేదా నిర్మాతదే తప్పని చెప్పడం ఎంతవరకు రైట్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. సక్సెస్ వస్తే డైరెక్టర్ క్రెడిట్ ఫెయిల్యూర్ అయితే హీరో లేదా ప్రొడక్షన్ తప్పులు అని చెప్పడం ఏ మాత్రం సరికాదు. ది గోట్ మూవీ రికార్డ్ స్థాయి థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.