మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ప్పోరి జగన్నాథ్ రూపొందించిన ‘లోఫర్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమయింది దిశా పటాని. ప్రస్తుతం బాలీవుడ్ లో నటిస్తోన్న ఈ భామకు ఓ యంగ్ హీరోతో ఎఫైర్ ఉన్నట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. బాలీవుడ్ లో ఇలాంటి రూమర్స్ కామన్. ఒకరితో మరొకరు డేటింగ్ చేస్తుండడం కూడా అక్కడ చాలా చిన్న విషయంగా పరిగణిస్తారు.
అయితే ఈ ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు వెళ్ళడం చాలా కష్టమనే చెప్పాలి. ఇప్పుడు దిశా కూడా టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ లో ఉందని సమాచారం. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకొని చక్కగా తిరుగుతున్నారట. అయితే ఈ విషయంపై దిశా, టైగర్ ఇద్దరు స్పందించలేదు. వీరు ఈ విషయాలను ఖండించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి!