దిల్ రాజు బ్యానర్ లో డీజే బ్యూటీ

Advertisement

తన సంస్థకు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్లనే దిల్ రాజు అంత ఈజీగా వదలడు. ‘మున్నా’తో దిల్ రాజు బ్యానర్ కి ఫస్ట్ ఫ్లాప్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో ‘బృందావనం’తో మరో హిట్ కొట్టిన దిల్ రాజు, ఆ తర్వాత “ఓ మై ఫ్రెండ్”తో తమ సంస్థకు మరో ఫ్లాప్ ఇచ్చిన వేణు శ్రీరామ్ తో రీసెంట్ గా “మిడిల్ క్లాస్ అబ్బాయి” తీయించి మరీ హిట్ అందుకొన్నాడు. అలాంటి దిల్ రాజు తన సంస్థకు హిట్ ఇచ్చిన హీరోలు, హీరోయిన్లను ఊరికే వదులుతాడా చెప్పండి. అందుకే తన సంస్థలో నటించి హిట్ కొట్టిన ప్రతి హీరోయిన్ తో ఓ 3 సినిమాల అగ్రిమెంట్ కుదుర్చుకుంటాడు దిల్ రాజు.

ఆ కోవలో ఇటీవల “దువ్వాడ జగన్నాధం”తో సూపర్ హిట్ అందుకొన్న పూజా హెగ్డేతో కూడా అగ్రిమెంట్ చేయించుకొన్నట్లున్నాడు దిల్ రాజు. “డీజే” సక్సెస్ లో పూజా నడుమందాలు కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అందుకే నితిన్ కథానాయకుడిగా తమ బ్యానర్ కి “శతమానమ్ భవతి”తో నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టిన శతీష్ వేగేశ్న దర్శకత్వంలో నిర్మించనున్న “శ్రీనివాస కళ్యాణం”లో కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేశారని వినికిడి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news