‘శ్రీమంతుడు’, ‘బ్రహ్మోత్సవం’, ‘సరిలేరు నీకెవ్వరు’, మొన్నీ మధ్య వచ్చిన ‘సర్కారు వారి పాట’ఈ పోస్టర్లలో ఓ ఎలిమెంట్ కామన్‌గా ఉంటుంది. దీని కోసం పోస్టర్లను పెద్ద నిశితంగా కూడా గమనించక్కర్లేదు. పోస్టర్ టాప్ సెంటర్‌కో, సైడ్‌కో చిన్న లోగో ఉంటుంది. GMB ఎంటర్‌టైన్‌మెంట్స్ అని. అంటే ఆ సినిమా నిర్మాతల్లో మహేష్‌బాబు కూడా ఒకరని. ఇంకా క్లియర్‌గా చెప్పాంటే ఆ సినిమాలకు పారితోషికంతోపాటు లాభాల్లో వాటా కూడా ఉంటుంది. అయితే ఇటీవల అనౌన్స్ చేసిన మహేష్ – త్రివిక్రమ్ పోస్టర్‌లో మాత్రం అలాంటిదేం కనిపించలేదు. దీంతో ఈ పాయింట్ ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది.
హీరోలు సినిమాలకు పారితోషికం తీసుకోవడంతోపాటు లాభాల్లో వాటా తీసుకోవడం ఈ మధ్య ఎక్కువైంది. బాలీవుడ్‌లో చాలా రోజుల క్రితమే మొదలైన ఈ స్టైల్ ఇటీవల మన దగ్గరకు వచ్చింది. అగ్ర హీరోలు ఈ దిశగా ఆలోచిస్తున్నారు. అయితే ఎక్కువగా కనిపించేది మాత్రం మహేష్‌బాబు సినిమాలోనే. ‘అల వైకుంఠపురములో’కి అల్లు అర్జున్ చేశాడు. మహేష్ నుంచి ఇలాంటి సినిమాలు ఎక్కువగా రావడానికి కారణం నమ్రతనే అని చెప్పాలి. మహేష్ సినిమాల ఎంపిక తదితర విషయాలు ఆమె పరిధిలో ఉంటాయనేది టాలీవుడ్ వర్గాల టాక్.
మహేష్ – త్రివిక్రమ్ సినిమా విషయంలో ఈ స్టైల్ పని చేయలేదు. అందుకే పోస్టర్ మీద మహేష్ ప్రొడక్షన్ హౌస్ పేరు కనిపించలేదు. మామూలుగా సినిమాలు ఓకే చేసుకునేటప్పుడు నమత్ర ఇలాంటి విషయాలన్నీ చూసుకుంటుంటారు. మరి ఈ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గారో తెలియడం లేదు. అయితే హారిక హాసిని క్రియేషన్ బ్యానర్ అంటే సినిమా లాభాల్లో త్రివిక్రమ్‌కు వాటా ఉంటుంది. అంటే ఇద్దరు నిర్మాతలు అన్నమాట. ఇప్పుడు మళ్లీ మహేష్ అంటే మూడు వాటాలు అవుతాయి. అందుకే వద్దనుకున్నారేమో.
Most Recommended Video
ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!