Sudigali Sudheer: సుధీర్ ఇంస్టాగ్రామ్ లో ఒక్కరిని ఫాలో అవుతున్నారనీ మీకు తెలుసా?

బుల్లితెర మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమెడియన్ గా జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతున్నటువంటి సుధీర్ అనంతరం బుల్లితెరపై వరుస అవకాశాలను అందుకుని ఎంతో సక్సెస్ సాధించారు. ఇలా వరుస అవకాశాలను అందుకుంటు బిజీగా ఉన్నటువంటి ఈయనకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ సుధీర్ ప్రస్తుతం బుల్లితెరకు దూరమయ్యారు. తాజాగా ఈయన నటించిన గాలోడు సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసింది.

సుధీర్ తన తదుపరి చిత్రాన్ని నరేష్ కుప్పిలి దర్శకత్వంలో చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో సుధీర్ కు జోడిగా దివ్యభారతి నటిస్తున్నారు. ఈ సినిమాకు GOAT గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి సుధీర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈయనకు సోషల్ మీడియాలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఈయనకు ఇంస్టాగ్రామ్ లో దాదాపు 1.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.ఇలా ఇంతమంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్న సుదీర్ మాత్రం ఇంస్టాగ్రామ్ కేవలం ఒకే ఒక వ్యక్తిని ఫాలో అవుతున్నారు. ఇలా సుధీర్ ఫాలో అయ్యే ఆ వ్యక్తి ఎవరో మీరు గెస్ చేయగలరా అయితే రష్మీ మాత్రం కాదు.

మరి (Sudigali Sudheer) సుధీర్ ఫాలో అవుతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి.చిరంజీవి సుధీర్ కు చాలా ఇన్స్పిరేషన్ అని ఎన్నో సందర్భాలలో తెలియజేశారు. అందుకే ఈయన కేవలం తనని మాత్రమే ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus