ఈ అమ్మాయిల బూతు జోకులను తెలుగోళ్ళు ఎంజాయ్ చేయగలరా ?

  • April 9, 2019 / 01:57 PM IST

ఓ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఎన్ని కారణాలుంటాయో తెలియదు కానీ.. సినిమా హిట్ అవ్వడానికి మాత్రం ఉండే ఏకైక కారణం ఆడియన్స్ సినిమాకి కనెక్ట్ అవ్వడమే. ఒకవేళ కనెక్ట్ అవ్వకపోయినా.. ఎంజాయ్ చేసినా చాలు సినిమా బాక్సాఫీస్ దగ్గర హల్ చల్ చేయడం ఖాయం. కానీ.. తమిళంలో ఘన విజయం సొంతం చేసుకున్న కొన్ని చిత్రాలను తెలుగులో హిట్ కొడతాయి అనే నమ్మకంతో ఇక్కడ డబ్బింగ్ రూపంలో విడుదల చేసి కొందరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ దెబ్బ తిన్న సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా డిస్ట్రిబ్యూటర్స్ జంకుతున్న సినిమా “90 ఎం.ఎల్”.

తమిళంలో ఓవియా ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాక దాదాపు 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆడవాళ్ళ అడల్ట్ జోక్స్ మరియు శృంగార సన్నివేశాలతో నిండిపోయిన ఈ చిత్రం తెలుగులో ఎంతవరకూ ఆడుతుంది? అసలు జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేదా? అని కంగారు పడుతున్నారు. కాకపోతే.. బి, సి సెంటర్ ఆడియన్స్ మాత్రం గట్టిగానే ఎంజాయ్ చేస్తారు. అందుకు కారణం సినిమాలోని అడల్ట్ కంటెంటే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus