‘పోకిరి’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు.. ఆ తరువాత ‘సైనికుడు’ ‘అతిథి’ వంటి డిజాస్టర్ ఫలితాలను కూడా మూటకట్టుకున్నాడు. ఆ రెండు చిత్రాల ఫలితాలతో చాలా కన్ఫ్యూజ్ అయిపోయిన మహేష్ బాబు.. 3 ఏళ్ళ గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ డైరెక్షన్లో ‘ఖలేజా’ సినిమా చేసాడు. అయితే ఈ చిత్రం కూడా అంచనాలను అందుకోలేక డిజాస్టర్ అయ్యింది. ఈ నేపథ్యంలో.. ‘ ‘పోకిరి’ ఒక లాటరీ హిట్’, ‘మహేష్ బాబు పనైపోయింది’ అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి.
అయితే అటు తరువాత శ్రీనువైట్ల డైరెక్షన్లో వచ్చిన ‘దూకుడు’ చిత్రం ఆ కామెంట్స్ అన్నిటికి బ్రేక్ వెయ్యడమే కాకుండా.. మహేష్ బాబు బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది మరోసారి నిరూపించింది. ’14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్’ వారు నిర్మించిన ‘దూకుడు’ చిత్రం 2011 సెప్టెంబర్ 23న విడుదలైంది. ఓవర్సీస్ లో మొదటి 1 మిలియన్ డాలర్లను రాబట్టిన తెలుగు సినిమాగా ‘దూకుడు’ చిత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రం ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 15 cr |
సీడెడ్ | 7.5 cr |
వైజాగ్ | 4.4 cr |
ఈస్ట్ | 3.2 cr |
వెస్ట్ | 2.8 cr |
కృష్ణా | 3.0 cr |
గుంటూరు | 4.2 cr |
నెల్లూరు | 1.7 cr |
ఏపీ (టోటల్) | 41.8 cr |
కర్ణాటక | 4.2 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.1 cr |
ఓవర్సీస్ | 9.6 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 56.7 cr (Share) |
‘దూకుడు’ చిత్రానికి 35కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఫుల్ రన్ ముగిసేసరికి 56.7 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ చిత్రం 101కోట్లను కొల్లగొట్టింది.
Most Recommended Video
‘బిగ్‌బాస్’ దివి గురించి మనకు తెలియని నిజాలు..!
తమకు ఇష్టమైన వాళ్ళకు కార్లను ప్రెజెంట్ చేసిన హీరోల లిస్ట్..!
ఇప్పటవరకూ ఎవ్వరూ చూడని బిగ్ బాస్ ‘అభిజీత్’ ఫోటో గ్యాలరీ!