‘బిగ్‌బాస్‌’ దివి గురించి మనకు తెలియని నిజాలు..!

మొన్న ఆదివారం ‘డోర్‌ నెం… ఒటి డ్యాష్‌..’ అంటూ బిగ్‌బాస్‌ లాంఛింగ్‌ స్టేజీ మీద అడుగుపెట్టింది. ‘ఎవరో కొత్తమ్మాయిలా ఉందే’ అంటూ కుర్రకారు అప్పుడే ఆమె గురించి సోషల్‌ మీడియాలో సెర్చింగ్‌ మొదలెట్టేశారు. ఆమెనే దివి అలియాస్‌ దివ్య వైద్య. మాంచి జోష్‌ ఉన్న ఐటెమ్‌ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన దివి… ఎవరు? ఇంతకుముందు ఏం చేసింది? ఈ వివరాలు మీ కోసం…

ఎంట్రీ సాంగ్‌లో సాంగ్‌లో మాంచి జోష్‌ చూపించింది దివి. మత్తెక్కించే కళ్లు, పాలరాతి లాంటి ఒళ్లు, కైపెక్కించే చూపులు, మైమరిపించే హొయలుతో ఇరగొట్టేసింది. ‘ఎవరీమే.. సూపర్‌ ఉంది’ అనుకుంటున్న సమయంలోనే షాక్‌ ఇచ్చింది. డ్యాన్స్‌ వేసిన తర్వాత దివి ఏం చేసిందో మీకు గుర్తుందా? నాగార్జున వచ్చిన పక్కన నిల్చున్నా ఆమె గమనించలేదు. అంతగా డ్యాన్స్‌లో, షోలో లీనమైపోయింది. ఎందుకంటే ఆమె బిగ్‌బాస్‌కు వచ్చిందే అందుకు. ఏంటి నాగ్‌ను పట్టించుకోకుండా ఉండటానికా అంటారు. అలా కాదు ఆమె ఉద్దేశమే బిగ్‌బాస్‌తో బ్రేక్‌ సంపాదించాలని.

‘‘నాకు యాక్టింగ్‌ అంటే చాలా ఇష్టం. మోడలింగ్‌తో నా కెరీర్‌ ప్రారంభించి.. మోడలింగ్‌లోకి వెళ్లాను. ఆ తర్వాత కొన్ని వెబ్‌సిరీస్‌లు, సినిమాలు చేశాను. ఇప్పుడు ఈ షోకి వచ్చి బ్రేక్‌ సాధించాలని అనుకుంటున్నాను. అందరూ సెలబ్రిటీలై ఇక్కడికి వస్తారు. నేను ఇక్కడికి వచ్చి సెలబ్రిటీ అవుదాం అనుకుంటున్నా’’

– లాంఛింగ్‌ స్టేజీ మీద దివి
అలా వచ్చిందన్నమాట…

దివి అసలు పేరు దివ్య వైద్య. ఎంబీఏ చదివింది.. యాక్టర్‌గా రాణిద్దామని అనుకుంటున్న దివి ఇంట్లో ఇద్దరు డాక్టర్లున్నారు. దివి అమ్మ, అన్నయ్య ఇద్దరూ డాక్టర్సే. దివికి సినిమాల్లోకి రావాలని చాలా కోరిక. దానికి తొలుత మోడలింగ్‌ను ఎంచుకుంది. చిన్న చిన్న యాడ్స్‌లో నటించింది. ఆ సమయంలోనే ‘మహర్షి’ సినిమాలో నటించే అవకాశం సంపాదించింది. సినిమాలో కాలేజీ స్టూడెంట్‌ పాత్ర కోసం ఆడిషన్స్‌ జరిగితే వెళ్లి ట్రై చేసింది. డైరెక్టర్ వంశీపైడిపల్లికి దివి నటన నచ్చి సినిమాలో అవకాశం ఇచ్చాడు. అందులోని కాలేజీ ఎపిసోడ్‌ మహేశ్‌బాబుతో కలిసి నటించే ఛాన్స్‌ అలా కొట్టేసింది. ఆ తర్వాత వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించింది. అయితే అని ఇంకా రిలీజ్ కాలేదు. మరోవైపు కవర్ సాంగ్స్ కూడా చేసింది బిగ్‌బాస్‌లోకి వచ్చే ముందు సందీప్ కిషన్ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది.

అదే నా ఇమేజ్‌…

నా మీద ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ కానీ, అభిప్రాయాలు కానీ ఎవ్వరికీ ఉండవు అంటూ తన గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. నేను బయటకు ఎలా కనిపిస్తానో అదే నా ఇమేజ్ అవుతుందని బోల్డ్‌గా చెప్పేసింది. జీవితంలో ఎంతోమంది, ఎన్నో సలహాలు ఇస్తుంటారు.. అయితే నేను వాటిని ఎలా తీసుకుంటాను, ఎలా ఉంటానో అదే నేను అంటూ జీవితంలో చాలా క్లారిటీ ఉన్న అమ్మాయి అని తెలుస్తోంది. తొలి రోజు ఎపిసోడ్‌లో పెద్దగా స్క్రీన్‌ స్పేస్‌ ఆక్యుపై చేసినట్లు కనిపించలేదు. డ్యాన్స్‌ కూడా వేయలేదని సూర్యకిరణ్‌ కంప్లైంట్‌ (సరదా) కూడా చేశాడు. చూద్దాం ఈ రోజు నుంచి ఏం చేస్తుందో, ఎలా ఉంటుందో? అన్నట్లు దివి ఈ వారం ఎలిమినేషన్‌ లిస్ట్‌లో కూడా ఉంది. అంటే ఆమెకు అభిమానుల సపోర్టు ఎలా ఉందో ఈ వారమే తెలిసిపోతుంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus