ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా

RRR సినిమా తో భారీ విజయాన్ని అందుకోవడంతో జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలతో కూడా అదే తరహాలో సక్సెస్ అందుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడుతున్నాడు. పాన్ ఇండియన్ మార్కెట్ లోకి ఒకసారి అడుగు పెడితే ఆ తర్వాత ఏ హీరో కూడా వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. ఇక ఎన్టీఆర్ కూడా RRR సినిమా ఆఫర్ రాగానే అంతకుముందు ఓకే చేసిన త్రివిక్రమ్ సినిమాను కూడా పక్కన పెట్టేశాడు. త్రివిక్రమ్ పాన్ ఇండియా కథ కాకుండా లోకల్ తెలుగు సినిమా చేస్తాడు కాబట్టి అందుకే ఆయనను కాదని ఎన్టీఆర్ కొరటాల శివను లైన్ లో పెట్టాడు.

అయితే కొరటాల శివ తో 30వ సినిమా చేయబోతున్న ఎన్టీఆర్ ఆ తర్వాత 31 వ సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతోంది. అయితే ఈ రెండు ప్రాజెక్టులను ఎన్టీఆర్ ఎప్పుడు మొదలు పెడతాడు అనే విషయంలో అయితే ఇంకా అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ రాలేదు. కొరటాల శివ తో 31 సినిమాను మాత్రం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో తప్పకుండా ఆరోజు ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్టులకు సంబంధించి అప్డేట్స్ వస్తాయి అని ఫ్యాన్స్ అయితే చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను పూర్తి చేసుకున్నాడు. ఇక ఎన్టీఆర్ బర్త్ డే రోజు ఆ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయాలని అని అనుకుంటున్నారు. ఇక మరొకవైపు దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజున తన ప్రాజెక్టును కూడా అనౌన్స్ చేయాలని ప్రాజెక్టుకు సంబంధించి మరొక అప్డేట్ కూడా ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యాడట. ఇదే జరిగితే ఎన్టీఆర్ పుట్టిన రోజు డబుల్ ధమాకా ఉంటుందని చెప్పవచ్చు. ఒకేరోజు రెండు ప్రాజెక్ట్ లను ఎనౌన్స్ చేస్తే ఫ్యాన్స్ కు అంతకంటే మరో కిక్ ఉండదు.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus