DSP, Thaman: థమన్, దేవి శ్రీ ప్రసాద్.. ఇద్దరిది ఒక్కటే బాధ!

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పోటాపోటీగా సంగీతమందిస్తున్నారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ఎస్ ఎస్ తమన్. వీరు టాప్ ప్లేస్ లో ఉన్నారు అని చెప్పాలి. ఇద్దరు కూడా స్టార్ హీరోలకు తగ్గట్టుగా సినిమాలకు సరిపోయే విధంగా మంచి మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా విజయంలో పాటలు ఎంత ముఖ్యమో గుర్తు చేస్తున్నారు. అయితే వీరికి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా గతంలో చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ అటు వైపు వెళ్ళడానికి ఇష్టపడడం లేదు.

గతంలో దేవి శ్రీ ప్రసాద్ సల్మాన్ ఖాన్ రెడీ సినిమాలో ఒక పాటకు ట్యూన్ కూడా కట్టాడు. ఇక ఆ తర్వాత మళ్లీ అవకాశాలు వచ్చినా కూడా చేయలేదు. ఇక థమన్ కూడా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఆఫర్స్ పై చాలా క్లారిటీ గా వివరణ ఇచ్చాడు. థమన్ కూడా ఎంతో ఇష్టంగా రెండు మూడు సినిమాలకు మ్యూజిక్ అందించాడు. కానీ అతను సోలోగా మ్యూజిక్ ఇవ్వలేదు కేవలం రెండు మూడు పాటలు మాత్రమే చేశాడు.

అంతేకాకుండా ఒక సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇచ్చాడు. అయితే ఈ విషయంలో మాత్రం థమన్ తో పాటు దేవిశ్రీప్రసాద్ కూడా ఒకే తరహాలో ఆలోచిస్తున్నారు. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సినిమా నుంచి ఒక పాట వస్తే మంచి విజయాన్ని అందుకుంటాయి. అయితే ఆ పాటను ఎవరు కంపోజ్ చేశారు అనే విషయంలో చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది అని ఒకే సినిమాకు నలుగురు లేదా ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండడం ఏమిటని ఇటీవల దేవిశ్రీప్రసాద్ వివరణ ఇచ్చాడు.

అయితే గతంలోనే థమన్ ఈ విషయంలో అదే తరహాలో వివరణ ఇచ్చాడు. పెళ్లి ఒకడు చేసుకుంటే శోభనం మరొకరితో అన్నట్లుగా ఒకరు పాటలు అందిస్తే మరొకరు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించడం ఏమిటో అర్థం కావడం లేదని అందుకే బాలీవుడ్ సినిమాలు చేయడం లేదు అని తెలియజేశాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ కూడా దాదాపు అదే తరహాలో బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి అదే కారణమని ఒక సినిమా పూర్తిగా సంగీతం అందించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని తెలియజేశాడు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus