Tollywood: నిర్మాతలతో పాటు బయ్యర్స్ ను కూడా ఇబ్బంది పెడుతున్న డబ్బింగ్ సినిమాలు

మన తెలుగులో చాలా పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి. అయితే పాన్ ఇండియా సినిమా అంటూ పోస్టర్ పై వేసినంత మాత్రాన.. ఒకే టైంలో అన్ని భాషల్లోనూ మన తెలుగు సినిమాలు రిలీజ్ కావడం లేదు. అదే ఇంకో భాషలో రూపొందిన పాన్ ఇండియా సినిమాలు అయితే ఒకేసారి తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. మన తెలుగు ప్రేక్షకులు సినిమా బాగుంటే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తుంటారు.

ఇంకా చెప్పాలంటే పరభాషా చిత్రాలనే నెత్తిపై పెట్టుకుంటారు. కానీ పక్క రాష్ట్రాల్లో అలా ఉండదు. ముందుగా వాళ్ళ సినిమాలకే ప్రియారిటీ ఉంటుంది. వాళ్ళ సినిమాలకే ఎక్కువ థియేటర్లు ఇచ్చుకుంటారు. ఆ తర్వాతే పక్క భాషా చిత్రాలకి ప్రియారిటీ ఇస్తారు. అందుకే మన తెలుగులో అనౌన్స్ చేసిన చాలా పాన్ ఇండియా సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కావడం లేదు. పోనీ మన (Tollywood) తెలుగు సినిమాని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసుకుందాం అనుకుంటే..

అక్కడ కూడా డబ్బింగ్ సినిమాలు డామినేట్ చేసేస్తున్నాయి. ‘భోళా శంకర్’ టైంలో ‘జైలర్’ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చారు. వీకెండ్ వరకు కూడా ‘భోళా..’ కి ఎక్కువ థియేటర్లు దొరికింది లేదు. దాని టాక్ బాలేదు కాబట్టి ఓకే..! కానీ లేటెస్ట్ గా వచ్చిన ‘భగవంత్ కేసరి’ ‘టైగర్ నాగేశ్వరరావు’ ల సంగతికి వస్తే.. వాటి కంటే ‘లియో’ కి ఎక్కువ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. స్ట్రైట్ తెలుగు సినిమాలను డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎక్కువ రేట్లు పెట్టి కొనుగోలు చేస్తారు.

కానీ డబ్బింగ్ సినిమాలను కేవలం రెంట్ల బేస్ మీద పెద్ద నిర్మాతలు రిలీజ్ చేయడం వల్ల స్ట్రైట్ తెలుగు సినిమాలకి దెబ్బ పడిపోతుంది. స్ట్రైట్ తెలుగు సినిమాల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఇలా కూడా నష్టపోతున్నారు. పండుగల సీజన్లలో డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేయకూడదు అనే రూల్ తెలుగు రాష్ట్రాల్లో కూడా వస్తేనే బాగుంటుంది అని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు విన్నపించుకుంటున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus