ఈ మధ్యనే బోయపాటి శ్రీను, రామ్ కలయికలో రూపొందిన ‘స్కంద’ సినిమా వచ్చింది. మొదటి షోతోనే ఈ మూవీ నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. కానీ నిర్మాత ముందుగానే సేఫ్ అయ్యాడు. టేబుల్ ప్రాఫిట్స్ అందుకున్నాడు. ఇక ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి. బోయపాటి శ్రీనుకి మాస్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ కారణంగా ఓపెనింగ్స్.. డిస్ట్రిబ్యూటర్స్ ని చాలా వరకు బయటపడేశాయి అని చెప్పాలి. అలా అని ఇది హిట్ సినిమా అని చెప్పలేం.
కాకపోతే ఓ రకంగా చేస్తే హిట్ అయ్యే ఆస్కారం ఉండేది. దర్శకుడు బోయపాటి ముందుగా వేసుకున్న ప్లాన్ కూడా అదే..! కానీ అది జరగలేదు. అదేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ‘స్కంద’ సినిమాలో రామ్ డబుల్ రోల్ లో కనిపించిన సంగతి తెలిసిందే. మొదటిసారి ‘స్కంద’ చూసే వాళ్ళకి అసలు ఈ సినిమాలో హీరో డబుల్ రోల్ చేస్తున్నాడు అనే ఆలోచనే రాకుండా చేశాడు బోయపాటి. ‘లెజెండ్’ ఇంటర్వెల్ లో రెండో బాలయ్యని రప్పించినట్టు..
‘స్కంద’ క్లైమాక్స్ లో రెండో రామ్ ని రప్పించి సీక్వెల్ ప్లాన్ ఉందని చెప్పకనే చెప్పాడు. కానీ రెండో రామ్ ప్లేస్ లో రావాల్సింది బాలయ్య అనేది బోయపాటి సన్నిహిత వర్గాల సమాచారం. అవును ఈ సినిమాలో బాలయ్యతో ఓ గెస్ట్ రోల్ చేయించాలని బోయపాటి ముందుగా అనుకున్నాడు. ‘అఖండ 2 ‘ కూడా వీరి కాంబినేషన్లో రాబోతుంది. కాబట్టి ‘స్కంద’ చివర్లో అందులోని అఘోర(అఖండ లో బాలయ్య) తో లాస్ట్ ఫైట్ పెట్టాలని అనుకున్నాడు.
కానీ బాలయ్యకి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల అది కుదరలేదు. ఒకవేళ రామ్ ప్లేస్ లో బాలయ్య ఆ పాత్ర చేసి ఉంటే.. రిజల్ట్ వేరే లెవెల్లో ఉండేది. బాలీవుడ్ వాళ్ళు ఎక్కువగా చేసేది ఇదే. తమిళంలో లోకేష్ కనగరాజ్ కూడా ఇదే తరహా సినిమాలు చేస్తున్నాడు. మనమైతే (Boyapati) బోయపాటి యూనివర్స్ ను మిస్ అయ్యాం. అంతే..!