టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ వార్తల్లో నిలుస్తోంది. ‘ఆకాశంలో ఒక తార’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం, దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తదుపరి తెలుగు సినిమా కావడం విశేషం. దర్శకుడు పవన్ సాదినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. చిత్ర యూనిట్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, కేవలం ఒక చివరి షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.
ఈ చిత్రంలో దుల్కర్ సరసన హీరోయిన్‌గా సాత్విక వీరవల్లి నటిస్తున్నారు. ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ విడుదల చేసిన ప్రత్యేక వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంది. “ఆకాశం కన్నా పెద్ద కలను మోసుకొచ్చిన కలల అమ్మాయి”గా ఆమె పాత్రను చిత్ర బృందం వర్ణించడం విశేషం. ఈ పాత్రే సినిమాకు ఎమోషనల్ కోర్‌గా నిలవనుందని సమాచారం. ఆశ, ఆకాంక్ష, కలల సాధన వంటి అంశాల చుట్టూ కథ సాగనుందని తెలుస్తోంది.
ఈ సినిమాను సందీప్ గున్నం, రమ్య గున్నం లు లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై నిర్మిస్తుండగా, స్వప్న సినిమా, గీత ఆర్ట్స్ ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. 1986లో వచ్చిన సింహాసనం సినిమాలోని “ఆకాశం లో ఒక తార” పాట నుంచి ప్రేరణ పొందిన టైటిల్, క్లాసిక్ తెలుగు సినిమాలకు దర్శకులిచ్చిన గౌరవంగా చెప్పుకోవచ్చు.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సాత్విక వీరవల్లి ఒక తమిళ NRI. 2023లో వైరల్ అయిన వీడియోలతో గుర్తింపు పొందిన ఆమె, అమెరికాలో టిక్‌టాక్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు దుల్కర్ సల్మాన్‌తో కలిసి లీడ్ హీరోయిన్‌గా నటించడం నిజంగా సాత్విక కల నిజమైనట్టే. ఈ సినిమా విడుదలతో ఆమెకు టాలీవుడ్‌లో కొత్త అవకాశాలు వస్తాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది.