Dunki OTT: షారుఖ్‌ కొత్త సినిమా ఓటీటీ ఇదే… ఎప్పుడు రావొచ్చంటే?

షారుఖ్‌ ఖాన్‌ – రాజ్‌ కుమార్‌ హిరాణీ… ఓ డిఫరెంట్ కాంబినేషన్‌. ఈ కాంబోలో సినిమా అనేసరికి షారుఖ్‌, హిరాణీ అభిమానులే కాదు, సగటు సినిమా అభిమానులు కూడా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. అలా చేసిన వెయిటింగ్‌కి ఫుల్‌స్టాప్‌ పడింది. ‘డంకీ’ సినిమా ఈ రోజు విడుదలైపోయింది. మంచి టాక్‌ కూడా సంపాదించుకుంది. అంతేకాదు మరో విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది. అదే ఓటటీ రిలీజ్‌. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతుంది అనే విషయం నిజానికి సినిమా రిలీజ్‌కు ముందే తెలిసిపోయింది.

షారుఖ్‌ ఖాన్‌కు 2023 బాగా కలిసొచ్చింది అని చెప్పాలి. ఈ ఏడాది అతని నుండి మూడు సినిమాలు వస్తే మూడూ భారీ విజయాలు అందుకున్నారు. రెండు రూ. వెయ్యి కోట్లు దాటగా… ఇంకకొటి ఇప్పుడే వచ్చింది. ‘పఠాన్‌’, ‘జవాన్‌’ సినిమాలు మాస్‌ ఎలిమెంట్స్‌తో మైమరరిపించగా… ‘డంకీ’ ఎమోషనల్‌ టచ్‌తో అలరించింది. ఈ సినిమాను థియేటర్‌లో చూసి ఆ ఎమోషన్‌ను ఫీల్‌ అవ్వాలి అనుకుంటే ఈ వార్త ఇప్పుడు మీకు అంత ఆసక్తికరంగా అనిపించదు. అదే ఓటీటీ కోసం వెయిట్‌ చేస్తుంటే ఇంట్రెస్టింగ్‌.

ఎందుకంటే ‘డంకీ’ (Dunki) సినిమా ఓటీటీ పార్ట్‌నర్‌ జియో సినిమా కాబట్టి. ఇటలీవల జ‌రిగిన‌ ఓ ఈవెంట్‌లో జియో స్టూడియోస్ ప్లాట్‌ ఫామ్‌లో రానున్న సినిమాలు, సిరీస్‌ల లిస్ట్‌ చూపించారు. అందులో త్వరలో రానున్న సినిమాల లిస్ట్‌లో ‘డంకీ’ కూడా ఉంది. అంటే ఈ సినిమా అందులో వస్తున్నట్లే. అయితే ఎప్పటి నుండి ఈ సినిమా స్ట్రీమింగ్‌కి వస్తుంది అనే విసయంలో స్పష్టత లేదు.

అన్నట్లు ఈ సినిమాను జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిలింస్ నిర్మించాయి. ఈ నేపథ్యంలో జియో సినిమాలో ఈ సినిమా రావడం ఆశ్చర్యం ఏమీ కాకపోవచ్చు. అయితే గతంలో కొన్ని సినిమాలను ఇచ్చిన తరహాలో ‘డంకీ’ని ఉచితంగా ఓటీటీలో చూపిస్తారా? లేక ఏమైనా సబ్‌స్క్రిప్షన్‌ పరిధిలోకి తీసుకొస్తారా? అనేది విషయం. అయితే వచ్చే సంక్రాంతి తర్వాతనే ఈ సినిమా ఓటీటీకి వస్తుందని ఓ అంచనా.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus