Navdeep: యంగ్ హీరోకి షాకిచ్చిన ఈడీ!
- September 14, 2021 / 03:45 PM ISTByFilmy Focus
టాలీవుడ్ డ్రగ్స్ కేసుకి సంబంధించి పలువురు సినీ ప్రముఖులను ఈడీ ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి మూడు రోజులు మీడియా ఈ విషయాలను బాగా కవర్ చేసింది కానీ ఆ తరువాత లైట్ తీసుకుంది. రవితేజ, రానా లాంటి హీరోల విచారణ సందర్భంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రొఫైల్ మెయింటైన్ చేసింది. అయితే ఇప్పుడు మీడియా దృష్టి మరోసారి ఈడీ విచారణపై పడింది. దీనికి కారణం నవదీప్. ఐదేళ్లక్రితం ఈ కేసు మొదలైనప్పటి నుండి చాలా మంది నవదీప్ వైపు అనుమానంగా చూశారు.
అలాంటి వ్యక్తి మరోసారి విచారణకు హాజరవుతున్నాడనగానే.. ఆటోమేటిక్ గా మీడియా ఎటెన్షన్ వచ్చేసింది. దానికి తగ్గట్లుగానే ఈడీ అధికారులు నవదీప్ ను తొమ్మిది గంటల పాటు ప్రశ్నించారు. అక్కడితో నవదీప్ ఎపిసోడ్ పూర్తవ్వలేదు. విచారణకు మరోసారి హాజరు కావాల్సి ఉంటుందని ఈడీ అధికారులు నవదీప్ ను ఆదేశించారు. ఇప్పటివరకు విచారణకు హాజరైన ఏ సెలబ్రిటీను కూడా ఈడీ ఇలా అడగలేదు. నవదీప్ విషయంలో మాత్రం మరోసారి రావాల్సివుంటుందని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

నవదీప్ తో పాటు.. ఎఫ్ క్లబ్ మేనేజర్ ను ఒకేసారి ప్రశ్నించారు అధికారులు. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ కు సంబంధించిన వివరాలు అడిగారు. అయితే మేనేజర్ తో పాటు నవదీప్ పొంతనలేని సమాధానాలు చెప్పారట. కొన్ని ప్రశ్నలను నవదీప్ ఆన్సర్ కూడా చేయలేదట. దీంతో మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది.
1

2

3

4

5

6

7

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

















