Ram Charan: మరోసారి అలాంటి లుక్‌లో రామ్‌చరణ్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ ఎడిటర్‌ కామెంట్స్‌ వైరల్‌!

ఎర్లీ స్టేజీలో బాడీ షేమింగ్‌ సమస్యను ఎదుర్కొన్న హీరోల్లో రామ్‌ చరణ్‌ ఒకడు. చాలా సినిమాల్లో ఆయన దవడను చూసి.. ఇదేంటి ఫేస్‌ ఇలా ఉంది అని అనిన వాళ్లు ఉన్నారు. ఇప్పుడు అదే దవడ వల్ల ఆయన గ్రీక్‌ గాడ్‌ లాంటి లుక్‌లో కనిపిస్తున్నాడు అని ఫ్యాన్స్‌ అంటున్నారు. ఇదే మాటను ప్రముఖ ఎడిటర్‌ లివింగ్‌స్టన్‌ ఆంటోనీ రూబెన్‌ కూడా చెప్పారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)  సినిమాకు ఆయన పని చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎక్స్‌ స్పేసెస్‌లో ముచ్చటించారు.

Ram Charan

ఈ క్రమంలో రామ్ చరణ్ (Ram Charan)  లుక్‌ గురించి, బాడీ గురించి రూబెన్ మాటలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో రామ్‌చరణ్‌ కనిపిస్తాడని, ఆయన ఒక్కో షేడ్‌ కోసం ఒక్కోలా నటించాల్సి వచ్చిందని, ఆ పనిని ఆయన వంద శాతం అద్భుతంగా చేశాడని చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ చూడటానికి గ్రీక్ గాడ్‌లా ఉంటాడని, వారికి ఉండే ఫీచర్స్ చరణ్‌లో ఉన్నాయని అన్నారు.

రామ్ చరణ్ జాలైన్ (దవడ) అంటే తనకు నాకు ఇష్టమని చెప్పిన రూబెన్‌.. ఆయన ఓ నిఘంటువులా ఉంటాడని మెచ్చుకున్నారు. అంతేకాదు ఈ సినిమాలో చరణ్‌ సిక్స్‌ప్యాక్‌ లుక్‌లో కూడా కనిపిస్తాడని లీక్‌ ఇచ్చేశారు. ఆ లుక్‌లో చరణ్‌ భలే ఉన్నాడని, అమ్మాయిలకు బాగా నచ్చేస్తాడని చెప్పుకొచ్చారు. దీంతో రూబెన్ మాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. సినిమాను చూడటానికి ఉండే కారణాల్లో ఇప్పుడు ఈ పాయింట్‌ ఒకటి చేరింది అని చెప్పాలి. గతంలో ‘ధృవ’ (Dhruva), ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR Movie) సినిమా కోసం చరణ్‌ టోన్డ్‌ బాడీ లుక్‌లో కనిపించాడు.

ఇక పైన చెప్పినట్ఉ రామ్ చరణ్ లుక్స్ విషయంలో కెరీర్ ఆరంభం నుంచి ట్రోల్‌ జరుగుతూనే ఉంది. కొన్ని సీన్లు, ఫ్రేమ్స్‌లో చరణ్‌ కనిపించే తీరు మీద నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేశారు, చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు రూబెన్ మాటలతో వారి నోళ్లు మూయించినట్టు అయింది. అయితే సినిమా వచ్చాక ఈ విషయంలో మరింత క్లారిటీ సమాధానాలు వస్తాయని చెప్పొచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus