భీమ్లా నాయక్ సింగర్ మరో సంచలనం

Ad not loaded.

భీమ్లా నాయక్ చిత్రంలో అడవి తల్లి, ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎత్తర జెండా, ఆచార్యలో లాహే లాహే వంటి సూపర్ హిట్ పాటలతో శ్రోతల్లో పేరు తెచ్చుకున్న సింగర్ సాహితీ చాగంటి. ఈ యువ గాయనీ తాజాగా ఈ క్షణం అనే ఇండిపెండెంట్ సాంగ్ తో మన ముందుకొచ్చింది. ఈ పాటను సాహితీనే స్వరపర్చి పాడటంతో పాటు వీడియోలో పర్మార్మ్ చేసింది. ఈ పాట డిజైనింగ్ లో ప్రతీక్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేశారు. శ్రీ హర్ష ఈమని సాహిత్యాన్ని అందించారు.

ఈ పాట చూస్తే..ఊహలు, ఊసులు, ఉరుకులు, పరుగులు..తీరిక లేదని ఒక క్షణము. నీతో నువ్వుగా గడిపిన వయసులు చూసావా నిను వెతకడము. అంటూ సాగుతుంది. రెగ్యులర్ లైఫ్ లో మనం ఎదుర్కొంటున్న ఒత్తిడి, మన కోసం ఒక క్షణమూ కేటాయించలేని బీజీ షెడ్యూల్స్, అవన్నింటికి దూరంగా ఒక ఫాంటసీ వరల్డ్ లోకి వెళ్లి నేచర్ ను ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ పాటలో కనిపించింది. ఈ పాట ట్యూన్, లిరిక్స్, పిక్చరైజేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉండి ఆకట్టుకుంటున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus