Eega Collections: రాజమౌళి ‘ఈగ’ కి 13 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

‘మగధీర’ వంటి పెద్ద బడ్జెట్ సినిమా తర్వాత.. ఒకటి, రెండు చిన్న బడ్జెట్ సినిమాలు తీయాలని అనుకున్నారు రాజమౌళి (Rajamouli). ఇందులో భాగంగా సునీల్ తో ‘మర్యాద రామన్న’ అనే సినిమా చేశారు. ఇది చాలా ఫాస్ట్ గా ఫినిష్ అయ్యింది. తర్వాత రూ.10 కోట్ల బడ్జెట్ లో ‘ఈగ’ (Eega) అనే మూవీ చేయాలని అనుకున్నాడు. కానీ దానికి క్రేజ్ ఎక్కువ అవ్వడంతో.. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు అని బడ్జెట్ పెంచేశారు రాజమౌళి. అలా దాని బడ్జెట్ రూ.30 కోట్లు అయ్యింది. సమంత హీరోయిన్ గా నటించగా.. ఈ సినిమాలో నాని చిన్న పాత్ర పోషించాడు. సుదీప్ విలన్ గా నటించాడు.

Eega Collections

2012 జూలై 7న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద అయితే అద్భుతాలు చేసింది. నేటితో 13 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 12.87 cr
సీడెడ్ 5.85 cr
ఉత్తరాంధ్ర 3.19 cr
ఈస్ట్ 2.26 cr
వెస్ట్ 1.86 cr
గుంటూరు 2.71 cr
కృష్ణా 2.20 cr
నెల్లూరు 1.28 cr
ఏపీ+తెలంగాణ 32.22 cr
తమిళ్ + హిందీ + మలయాళం 14.02 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.68 cr
ఓవర్సీస్ 6.24cr
వరల్డ్ టోటల్ 57.16 cr (షేర్)

 

‘ఈగ’ (Eega) చిత్రం రూ.33.61 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. కొంత గ్యాప్ తర్వాత హిందీలో కూడా రిలీజ్ చేశారు.తమిళంలో ఈ సినిమా చాలా బాగా కలెక్ట్ చేసి అక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొత్తంగా ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.57.16 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకు రూ.23.55 కోట్ల లాభాలను అందించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus