Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » ఎందుకో ఏమో

ఎందుకో ఏమో

  • September 14, 2018 / 04:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎందుకో ఏమో

నందు, పునర్నవి జంటగా కోటి వద్దినేని దర్శకత్వంలో రూపొందిన లవ్ థ్రిల్లర్ “ఎందుకో ఏమో”. నోయల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఆగస్ట్ 12న విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించగలదో చూద్దాం..!!enduko-emo-2

కథ : జీవితంలో ధ్యేయంతోపాటు కుటుంబ విలువలు తెలిసిన కుర్రాడు కార్తీక్ (నందు). మంచి ఉద్యోగం, కారు, ఇల్లు అన్నీ తన కష్టార్జితంతో కొనుక్కోంటాడు. ఇక మంచి అమ్మాయిని చేసుకొని సెటిల్ అయిపోతే బెటర్ అనుకొంటున్న తరుణంలో తారసపడుతుంది హారిక (పునర్నవి). తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. లక్కీగా తను పనిచేసే ఆఫీస్ లోనే జాయినవుతుంది హారిక. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ మొదలయ్యింది అనుకొనే టైమ్ కి కథలోకి ఎంటరవుతాడు ప్రిన్స్ (నోయల్). చెడు మార్గంలో డబ్బులు సంపాదించే ప్రిన్స్ కి అమ్మాయిలంటే మోజు. డబ్బుతో కొందర్ని సొంతం చేసుకొంటాడు లేదా ప్రేమిస్తున్నాని అబద్ధం చెప్పి కొందర్ని వాడుకొంటాడు.

కట్ చేస్తే.. కార్తీక్-ప్రిన్స్ స్నేహితులు కావడంతో హారిక విషయంలో చిన్న బెట్ వేసుకొంటారు. స్వచ్చమైన ప్రేమతో దగ్గరవ్వడానికి ప్రయత్నించే తనకే హారిక సొంతమవుతుందని కార్తీ, కాదు డబ్బుతో మరిపించే తన పక్కలోకి వస్తుందని ప్రిన్స్ బెట్ వేసుకొంటారు.

అయితే.. కార్తీక్ నమ్మకాన్ని పోగొడుతూ హారిక మెలమెల్లగా ప్రిన్స్ కి దగ్గరవుతుంది. కాకపోతే హారికకి ఈ విషయంలో చిన్న లెక్క ఉంటుంది. ఏమిటా లెక్క ? చివరికి హారిక ఎవరికి దగ్గరైంది? అనేది “ఎందుకో ఏమో” కథాంశం.enduko-emo-3

నటీనటుల పనితీరు : నందు రెగ్యులర్ గా కనిపించాడు, నటించాడు కూడా. పాత్ర కోసం కష్టపడినట్లు ఎక్కడా కనిపించదు. “ఉయ్యాల జంపాల” ఫేమ్ పునర్నవి అందంగా కనిపించడంతోపాటు.. తన క్యారెక్టర్ లోని రెండు వేరియేషన్స్ ను అద్భుతంగా పండించింది. గ్లామరస్ గా కనిపించడానికి పెద్దగా మొహమాటపడని పునర్నవి పెద్ద లేదా మీడియం బడ్జెట్ సినిమాల్లో అవకాశాలు ఎందుకు ఇవ్వడం/రావడం లేదో అర్ధాంకావడం లేదు. సరైన అవకాశం ఇస్తే నటిగా తనను తాను ప్రూవ్ చేసుకొని స్టామినా ఉన్న నటి ఆమె.

“కుమార్ 21F” తర్వాత మరోమారు నోయల్ నెగిటివ్ రోల్లో అలరించాడు. మనోడి మ్యానరిజమ్స్ & విలనిజం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. భద్రమ్, నవీన్ నేని, సుడిగాలి సుధీర్ ల కామెడీ అక్కడక్కడా నవ్వించింది కానీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.enduko-emo-1

సాంకేతికవర్గం పనితీరు : ప్రవీణ్ స్వరపరిచిన బాణీలు చూడ్డానికంటే వినడానికి చాలా బాగున్నాయి. ముందు వినకపోవడం వల్ల సినిమాలో పాటలు వచ్చిన ప్రతిసారీ “అరే పాటలు బాగున్నాయే” అనిపిస్తుంది. సాంగ్స్ ప్లేస్ మెంట్ & కొరియోగ్రఫీ బాగుండి ఉంటే ఇంకాస్త ఎక్కువ రీచ్ ఉండేది.

జి.ఎస్.రాజ్ సినిమాటోగ్రఫీ రెగ్యులర్ గానే ఉంది. ఎడిటింగ్ సినిమాకి మైనస్ అయ్యింది. డి.ఐ విషయంలో కాస్త జాగ్రత్తపడితే బాగుండేది.

దర్శకుడు కోటి రాసుకొన్న కథలో ఉన్న నవ్యత, కథనంలో లోపించింది. ప్రీక్లైమాక్స్ లో ఉన్న పట్టు సినిమాలో ఎక్కడా కనిపించదు. సినిమా చాలా చోట్ల సాగుతున్న భావన కలుగుతుంది. సరైన స్క్రీన్ ప్లే రాసుకొని.. ఉన్న ట్విస్ట్ లను సరిగ్గా రివీల్ చేసుకొని ఉంటే ఒక మంచి రివెంజ్ థ్రిల్లర్ గా నిలిచేందుకు అర్హత ఉన్న “ఎందుకో ఏమో” సరైన డీలింగ్ & డీటెయిలింగ్ లేకపోవడం వలన ఫెయిల్ అయ్యింది.enduko-emo-5

విశ్లేషణ : కొత్త దర్శకుడు కావడంతో తడబడ్డాడు కానీ.. కాస్త అనుభవం ఉన్న వారు తీసి ఉంటే మినిమం యావరేజ్ గా నిలిచే కంటెంట్ ఉన్న సినిమా “ఎందుకో ఏమో”. అయితే.. థియేటర్లో చివరి వరకూ ఓపిగ్గా కూర్చుని చూడడం మాత్రం కష్టమే.enduko-emo-4

రేటింగ్ : 2/5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Enduko Emo Movie Review
  • #Enduko Emo Review
  • #Enduko Emo Telugu Review
  • #Movie Review
  • #Nandu

Also Read

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

related news

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhairavam Review in Telugu: భైరవం సినిమా రివ్యూ & రేటింగ్!

Bhairavam Review in Telugu: భైరవం సినిమా రివ్యూ & రేటింగ్!

ACE Review in Telugu: ఏస్ సినిమా రివ్యూ & రేటింగ్!

ACE Review in Telugu: ఏస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

18 hours ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

20 hours ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

20 hours ago
Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

21 hours ago
Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

23 hours ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

16 hours ago
Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

17 hours ago
క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

19 hours ago
ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

20 hours ago
రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version