సంక్రాంతి రేస్ నుండీ కళ్యాణ్ రామ్ ఔట్?

  • October 18, 2019 / 03:38 PM IST

ఇప్పటికే ‘అలా వైకుంఠపురములో’ అంటూ అల్లు అర్జున్.. ‘సరిలేరు నీకెవ్వరూ’ అంటూ మహేష్ బాబు జనవరి 12 నే తమ సినిమా విడుదల చేస్తున్నట్టు పోస్టర్లు విడుదల చేయడం పెద్ద చర్చకు దారి తీసింది. ఎలాగు ఒకరు తగ్గుతారు.. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇదిలా ఉంటే… ‘జనవరి 10’ న రజినీకాంత్ అందరికంటే ముందు ‘దర్బార్’ తో రావడానికి రెడీ అయ్యారు. వీళ్ళంతా పెద్ద హీరోలు కాబట్టి… థియేటర్లు వీళ్ళ సినిమాలకే ఎక్కువ లభిస్తాయి. అయితే పెద్దగా మార్కెట్ లేని కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’ కూడా సంక్రాంతికే రాబోతున్నట్టు టీజర్లో ప్రకటించారు.

దీంతో మొదట ఈ చిత్రాన్ని జనవరి 15 న విడుదల చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే పెద్ద హీరోల సినిమాలు విడుదలయ్యాక ఈ సినిమాకి థియేటర్లు దొరుకుతాయా అనే అనుమానం అందరిలోనూ ఉంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ‘ఎంత మంచివాడవురా’ చిత్రాన్ని జనవరి 24 న వాయిదా వేయబోతున్నారని తెలుస్తుంది. సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ‘శ్రీదేవి మూవీస్’ బ్యానర్ పై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా కలిసి నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus