మహానటుడు నందమూరి తారకరామారావు సినీ రంగంలో తిరుగులేని స్టార్ గా ఎదిగారు. ఆయనకు మనవడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. తాతకు తగ్గ మనవడిగా నిరూపించుకుంటున్నారు. వీరిద్దరిలో ఉన్న కామన్ పాయింట్స్ పై ఫోకస్..
శ్రమపడే తత్వంసీనియర్ ఎన్టీఆర్ యవ్వనంలో ఇంటింటికీ పాల ప్యాకెట్లు వేసి వచ్చిన డబ్బులతో పొట్ట నింపుకునేవారు. చిత్ర రంగంలో అవకాశం పొంది.. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఎంతో కష్టపడి సద్వినియోగం చేసుకుని మహా నటుడిగా ఎదిగారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా చిరు ప్రాయం నుంచే శ్రమించడం అలవాటు చేసుకున్నారు. ఎన్టీఆర్ మనవడిగా పరిచయం అయినప్పటికీ సొంతంగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు.
పౌరాణిక పాత్రలపై ప్రేమమహానటుడు ఎన్టీఆర్ కి పౌరాణిక పాత్రలంటే చాలా ఇష్టం. కృష్ణుడు, రాముడు వంటి దేవుళ్ల పాత్రలే కాదు దుర్యోధనుడు, రావణాసురుడు వంటి నెగిటివ్ రోల్స్ పోషించడానికి వెనుకాడలేదు. అలాంటి పాత్రల్లోనూ మెప్పించారు. తాతకు ఉన్నట్లే తారక్ కి కూడా పౌరాణిక పాత్రలంటే ప్రాణం. ఆ ఇష్టం తోనే యమదొంగ సినిమాలో యముడిగా కాసేపు కనిపించి అదరగొట్టారు. మంచి పౌరాణిక కథతో పూర్తి సినిమా చేసి అందరితో శెభాష్ అనిపించుకోవడానికి ఎదురుచూస్తున్నారు.
విభిన్న పాత్రలకు సైస్టార్ ఇమేజ్ వచ్చినప్పుడు కొన్ని పాత్రలకే పరిమితం కావాల్సి వస్తుంది. ఆ రూల్స్ ని బ్రేక్ చేశారు ఎన్టీఆర్. నంబర్ వన్ హీరోగా ఉన్నప్పటికీ మిస్సమ్మ, బడిపంతులు వంటి క్యారక్టర్ చేయడానికి ముందుకొచ్చారు. విజయాన్ని అందుకున్నారు. అదే విధంగా నేటి ఎన్టీఆర్ నడుచుకుంటున్నారు. సినిమాకు సినిమాకు వేరియేషన్ ఉండేలా తారక్ పాత్రలను ఎంచుకుంటున్నారు. లవర్ బాయ్ గా, మాస్ హీరోగా, క్లాస్ హీరోగా నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
లక్కీ నంబర్ 9సీనియర్ ఎన్టీఆర్ కి 9 లక్కీ నంబర్. అయన సీఎం అయినప్పుడు కూడా తన కారుకి 9999 సంఖ్య ఉండేలా చూసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి కూడా 9 అదృష్ట అంకె. అందుకోసమే అత్యధిక రేటు చెల్లించి తన కార్ కి 9999 నంబర్ ని సొంతం చేసుకున్నారు.
సేవ చేయాలనే తపనతనని దైవంగా పూజించే ప్రజలకు ఏదైనా సాయం చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రి అయి, పేదలకు అనేక పథకాలను ప్రవేశపెట్టి రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోను దేవుడు అనిపించుకున్నారు నందమూరి తారకరామారావు. సీనియర్ ఎన్టీఆర్ లోని సేవా తత్వం జూనియర్ ఎన్టీఆర్ లోను ఉంది. అందుకే టీడీపీ తరుపున ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. పలు సేవ కార్యక్రమాల్లో ముందున్నారు.
డైలాగ్ డెలివరీఎంతటి భారీ డైలాగ్ అయినా, సంస్కృత పదాలతో కూడినది అయినా పొల్లు పోకుండా స్పష్టంగా చెప్పడం సీనియర్ ఎన్టీఆర్ సొంతం. ఆ తర్వాత అలా డైలాగ్ చెప్పగల నటుడు తారక్. దాన వీర సూర కర్ణ సినిమాలో తాత చెప్పిన “ఆచార్య దేవోభవ” అనే డైలాగ్ ని “రామయ్య వస్తావయ్యా” సినిమాలో చెప్పి జూనియర్ ఎన్టీఆర్ అదరగొట్టారు.
తెలుగుపై పట్టుతెలుగు భాష, సంస్కృతి అంటే సీనియర్ ఎన్టీఆర్ కి గౌరవం. సినిమాల్లో కంటే బయట ఎన్టీఆర్ తెలుగు చాలా చక్కగా మాట్లాడగలరు. ఈ జనరేషన్ కి చెందిన వ్యక్తి అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కి తెలుగుపై మంచి పట్టు ఉంది. అయన మాట్లాడుతుంటే తెలుగు భాష ఇంత మాధుర్యమైనదా.. అని ఎవరైనా అనకుండా ఉండలేరు.