‘ఎవరు’ అప్పుడే 70 శాతం రికవరీ అయిపోయింది ..!

Advertisement

అడివి శేష్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘ఎవరు’. వెంకట్ రాంజీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘పీవీపీ సినిమాస్’ బ్యానర్ పై ప్రసాద్ వి పొట్లూరి నిర్మించాడు. ఆగష్టు 15 న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. గతేడాది ఆగష్టుకి ‘గూఢచారి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న అడివి శేష్.. ఈసారి ‘ఎవరు’ చిత్రంతో కూడా తన ట్యాలెంట్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. టీజర్, ట్రైలర్లు చూసినప్పుడే ఈ చిత్రం హిట్టని ఫిక్సయిపోయారు ప్రేక్షకులు. రీమేక్ సినిమా అయినప్పటికీ… అందులో ఉన్న ఇంటెలిజెంట్ మార్పులకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

ఇక ‘ఎవరు’ నాలుగు రోజుల ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 2.30 కోట్లు
వైజాగ్ – 0.75 కోట్లు
ఈస్ట్ – 0.42 కోట్లు


వెస్ట్ – 0.25 కోట్లు
కృష్ణా – 0.45 కోట్లు
గుంటూరు – 0.38 కోట్లు


నెల్లూరు – 0.12 కోట్లు
సీడెడ్ – 0.60 కోట్లు
————————————————–
ఏపీ + తెలంగాణ – 5.27 కోట్లు


రెస్ట్ అఫ్ ఇండియా – 0.50 కోట్లు
ఓవర్సీస్ – 1.20 కోట్లు
—————————————————-
వరల్డ్ వైడ్ టోటల్ – 6.97 కోట్లు (షేర్)
—————————————————-

‘ఎవరు’ చిత్రానికి 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి నాలుగు రోజులకే ఈ చిత్రం 6.97 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం. అంటే దాదాపు 70 శాతం రికవరీ అయిపోయింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 3.5 కోట్ల వరకూ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంది. మొదటి సోమవారం కూడా ఈ చిత్రం కలెక్షన్లు స్టడీగా ఉండటం విశేషం. ఈ వారం కూడా పోటీగా సినిమాలు లేవు కాబట్టి… ‘ఎవరు’ మరింత పుంజుకునే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ పండితులు. మరి వారి నమ్మకం ఎంత నిజమైందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus