టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి మహేష్ కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక రెమ్యునరేషన్ కి బదులుగా, భాగస్వామిగా ఉంటూ నాన్ థియేటర్ హక్కులు తీసుకుంటున్నాడట. మహేష్ గత సినిమాలకి కూడా 45 నుండి 46 కోట్ల వరకూ నాన్ థియేటర్ హక్కులు తీసుకునేవాడట . దీంతో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి నాన్ థియేటర్ హక్కుల రూపంలో 50 కోట్ల వరకూ మహేష్ కొట్టేస్తున్నాడట.
తాజా సమాచారం ప్రకారం యాభై కోట్లకు పైగా వచ్చే అవకాశాలు ఉన్నాయట. కేవలం శాటిలైట్ రైట్స్ రూపంలో రూ.17 కోట్ల వరకూ ఆఫర్ చేస్తున్నారట. ఇది కాకుండా డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్, ఆడియో రైట్స్ ఉండనే ఉన్నాయి కాబట్టి భారీగానే ముట్టే అవకాశం ఉంది. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం నాన్ థియేటర్ హక్కులు రూ.53 కోట్ల వరకు రావొచ్చని తెలుస్తుంది. అయితే నిర్మాత కాబట్టి మహేష్ కూడా ఈ చిత్రానికి కొంత పెట్టుబడి పెడుతున్నాడట. ముఖ్యంగా ప్రమోషన్ విషయంలో ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటానని ‘మహర్షి’ సినిమా టైంలోనే నిర్మాతలలో ఒకరైన దిల్ రాజుకు మాటిచ్చాడట. ఏమైనా తెలివిగా మార్కెట్ ను ఎలా కాపాడుకోవాలో మహేష్ ను చూసి మిగిలిన హీరోలు నేర్చుకోవాల్సిందే.