Krithi Shetty: బేబమ్మను చూసి ఆ హీరోయిన్లు బుద్ధి తెచ్చుకోవాలా..?

తెలుగులో కృతిశెట్టి కేవలం ఒక్క సినిమాలోనే నటించినా స్టార్ హీరోయిన్ల స్థాయిలో ఆమె పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఉప్పెన సినిమాలోని బేబమ్మ పాత్రలో కృతిశెట్టి అద్భుతంగా నటించి మెప్పించారు. ఉప్పెనతో కుర్రకారును కృతిశెట్టి ప్రేమలో ముంచెత్తగా తొలి సినిమా రిలీజ్ కాకముందే ఈ హీరోయిన్ కు భారీగా కొత్త సినిమా ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం కృతిశెట్టి సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఒక సినిమాతో పాటు శ్యామ్ సింగరాయ్ లో నటిస్తున్నారు.

ఈ యంగ్ హీరోయిన్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. అయితే ఈ హీరోయిన్ త్వరలో తన సినిమాలకు తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవాలని భావిస్తున్నారు. ఈ యంగ్ హీరోయిన్ కోరికను ఏ డైరెక్టర్ తీరుస్తారో చూడాల్సి ఉంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలైనా కొంతమంది హీరోయిన్లు ఇప్పటికీ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోలేదు. ఆ హీరోయిన్లకు బుద్ధి వచ్చే విధంగా కృతిశెట్టి డబ్బింగ్ విషయంలో నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

తాజాగా ఒక ఫ్యాన్ కృతిశెట్టిని ” మీరు మాట్లాడే తెలుగు చాలా బాగుంటుంది.. భవిష్యత్ సినిమాల్లో సొంతంగా డబ్బింగ్ చెబుతారా..?” అని ప్రశ్నించగా కృతిశెట్టి ఈ విషయాన్ని వెల్లడించారు. ఉప్పెన మూవీతో క్రేజీ హీరోయిన్ గా మారిన కృతిశెట్టికి స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఆఫర్లు వస్తే మాత్రం ఆమె మరింత బిజీ కావడంతో పాటు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus