రజినీ ఆరోగ్యం అందుకే చెడిందా..?

  • July 5, 2016 / 12:22 PM IST

గత కొంత కాలంగా సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆయనకు ఆరోగ్యం సరిగ్గా లేదని అందుకే కబాలి ఆడియో ఫంక్షన్ కు కూడా రాలేదని, మెడికల్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లారనే వార్తలు వినిపించాయి. అయితే అందులో నిజం లేదని చిన్న మెడికల్ టెస్ట్ కోసం అమెరికా వెళ్లాల్సివచ్చిందని ఆయన తమ్ముడు మీడియా ముఖంగా తెలిపారు.అందులో నిజమెంతున్నా..  ఇప్పుడు మరో న్యూస్ వెలుగులోకి వచ్చింది.

రోబో 2 సినిమా కోసం రజినీకాంత్ ఉపయోగించిన కాస్ట్యూమ్స్ వలనే ఆయనకు అనారోగ్యం కలిగిందని సమాచారం. ఈ సినిమాలో పాత్ర కోసం రజిని సుమారుగా 40 కేజీల బరువుగల కాస్ట్యూమ్స్ ను ధరించాల్సి వచ్చిందట. వేసవికాలంలో అంతటి బరువైన కాస్ట్యూమ్ తో ఔట్ డోర్ షూటింగ్ లో పాల్గొనడం, ఆయన శక్తికి మించి శ్రమించడం వలన అనారోగ్యం పాలయ్యారని చెప్పుకుంటున్నారు. దర్శకుడు శంకర్ కూడా వెంటనే ఆ కాస్ట్యూమ్స్ బరువు తగ్గించమని చెప్పినట్లు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus