వేగంగా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న “ఎఫ్ 2”!

Advertisement

పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాలతో హ్యాట్రిక్ అందుకున్న డైరక్టర్ అనిల్ రావిపూడి… ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. F2 అనే టైటిల్ ఫిక్స్ చేసిన ఇందులో విక్టరీ వెంకటేష్ తో కలిసి వరుణ్ తేజ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ పక్కన మెహరీన్ లు హీరోయిన్లు గా నటిస్తున్న సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రితం ప్రారంభమయింది. తొలిషాట్ వరుణ్ సందేశ్, ప్రియదర్శి పై చిత్రీకరించారు. అలాగే వెంకటేష్ కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. వెంకటేష్, వరుణ్.. ఇతర పాత్రధారులు లుంగీలో కనిపించడం హాట్ టాపిక్ అయింది. చిత్రీకరణ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కతోన్న ఈ చిత్రం విజయవంతంగా తొలి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ షెడ్యూల్ అనుకున్న దానికంటే బాగా వచ్చిందని సమాచారం. పెద్దగా గ్యాప్ తీసుకోకుండా త్వరలోనే సెకండ్ షెడ్యూల్‌కి వెళ్లబోతున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. ఈ చిత్రంతో నాలుగో విజయాన్ని అనిల్ రావిపూడి తన ఖాతాలో వేసుకుంటారని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus