మహేష్ మర్యాదలు అందుకొన్న అభిమానులు..!

  • March 20, 2018 / 12:35 PM IST

పండగ రోజు కొత్త బట్టలు కొనుక్కోకపోయినా పర్లేదు కానీ అభిమాన కథానాయకుడి సినిమా టికెట్ మాత్రం బ్లాక్ లొ కొని మరీ చూస్తాడు అభిమాని. అలాంటి అభిమాని కోసం ఒక హీరో మహా అయితే ఏం చేస్తాడు ఫేస్ బుక్, ట్విట్టర్ లో పండుగ విషెస్ చెబుతాడు, సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ లో అభివాదం చేస్తాడు, ధన్యవాదాలు చెబుతాడు. కేవలం తమ కథానాయకుడ్ని దగ్గర నుంచి చూడడం కోసం అభిమాని నానా తంటాలు పడుతుంటాడు. తన అభిమాన కథానాయకుడితో ఒక ఫోటో దొరకడమే అదృష్టంగా భావిస్తున్న తరుణంలో ఫోటో మాత్రమే కాదు తమ అభిమాన కథానాయకుడితో కాసేపు మాట్లాడి ఆయనతోపాటు కూర్చునే అవకాశం సొంతం చేసుకొన్నారు కొందరు అభిమానులు.

“భరత్ అనే నేను” సినిమా షూటింగ్ హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోందని తెలిసి కొందరు అభిమానులు అక్కడికి వెళ్లారు. షూటింగ్ కి ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ప్యాకప్ చెప్పేవారకూ సైలెంట్ గా తమ సూపర్ స్టార్ మహేష్ బాబును చూస్తూ కూర్చున్నారట. మరి వారి డిసిప్లైన్ నచ్చిందో లేక మరో కారణమో తెలియదు కానీ.. మహేష్ వాళ్ళని స్వయంగా దగ్గరకి పిలిచి అందరికీ ఫోటోలు ఇవ్వడమే కాక కాసేపు సరదాగా సంభాషించాడట. అప్పటికే ఆనందంతో కడుపు నిండిపోయిన అభిమానులకు స్నాక్స్ కూడా ఏర్పాటు చేయించి అందరూ తిని వెళ్ళండి అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లాడట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus