అబ్బాయి అమ్మాయిగా మారడానికి… అమ్మాయి అబ్బాయిగా మారడానికి శస్త్రచికిత్సలు ఉన్నాయనే విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో చాలామంది ఇలా మారుతున్నారు. అయితే సెలబ్రిటీలు మారడం ఆసక్తికరమే. తాజాగా బాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్ ఇలా మారిపోయాడు. స్వప్నిల్ కాస్త సైషాగా మారిపోయాడు. ఈ క్రమంలో అతని/ఆమె ఆలోచనల్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. స్వప్నిల్ షిండే.. బాలీవుడ్లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్. దీపికా పదుకొణె, కరీనా కపూర్, శ్రద్ధా కపూర్, తాప్సీ, కియారా అడ్వాణీ లాంటి స్టార్ నాయికల దగ్గర స్వప్నిల్ పని చేశాడు.
అయితే ఇటీవల ట్రాన్స్ఉమన్గా మారారు. ఈ క్రమంలో తన పేరును సైషాగా మార్చుకున్నట్లు చెప్పాడు. “మూలాలతో సంబంధం లేకుండా, బాల్యాన్ని గుర్తుచేసే ఒక అంశం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. అలా ఆ అంశం నన్ను ఒంటరితనానికి, ఏకాంతంలోకి నెట్టి నాపై ఒత్తిడి పెంచింది. ఒకానొక సమయంలో గందరగోళానికి గురిచేసింది. నేను అందరి కంటే భిన్నంగా ఉండడం వల్ల అబ్బాయిలు వేధించేవారు. అయితే నేను వాళ్లు అనుకున్న వ్యక్తిని కానని నాకు తెలుసు.
నేను సమాజంలో అలాంటి సమస్యలు చాలా ఎదుర్కొన్నా. నేను ఇప్పుడు మళ్లీ కొత్తగా పుట్టాను. నేను గే అవ్వడం వల్ల పురుషుల పట్ల ఆకర్షితుడయ్యానని నమ్ముతూ కొన్నేళ్లు ఉండిపోయాను. కానీ, ఆరేళ్ల క్రితమే నన్ను నేను అంగీకరించుకున్నా. ఈ రోజు ఆ విషయాన్నే అందరినీ అంగీకరించమని చెబుతున్నా. ఇకపై నేను గే కాదు. ఇప్పుడు నేను ట్రాన్స్ ఉమన్ని” అంటూ సైషా అలియాస్ స్వప్నిల్ ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు.
Most Recommended Video
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!