Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

ప్రభాస్ (Prabhas) అభిమానులకు ఊహించని సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ వారు. ఈ ఏడాది ఆరంభంలో, అంటే సంక్రాంతికి విడుదలైన ‘ది రాజాసాబ్’ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఆ వెలితిని భర్తీ చేస్తూ, అభిమానులకు ఈ ఏడాదే అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలని ప్రభాస్ బలంగా ఫిక్స్ అయినట్టు ఉన్నాడు. ఇందులో భాగంగానే ‘అజ్ఞాతపర్వం ముగిసింది.. తిరుగుబాటు మొదలైంది!’ అంటూ ‘ఫౌజి’ టీమ్ ఓ పవర్ఫుల్ పోస్టర్‌తో రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.

Fauzi Movie

హను రాఘవపూడి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను డిసెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారట. తాజాగా విడుదలైన పోస్టర్ ను గమనిస్తే, శవాల గుట్టల మధ్య, రక్తంతో తడిసిపోయి, చేతిలో తుపాకీ పట్టుకుని రాతిపై కూర్చున్న హీరో ప్రభాస్ ను చూపించారు. ఈ లుక్ గూస్‌బంప్స్ తెప్పించే విధంగా ఉంది. వాస్తవానికి ఇప్పటివరకు ఫౌజి (Fauzi) పై అంచనాలు లేవు. కానీ ఈ పవర్ఫుల్ పోస్టర్ గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనే చెప్పాలి.

అయితే, ఇక్కడ అందరికీ ఓ డౌట్ ఉంది. వాస్తవానికి ప్రభాస్ కెరీర్‌లో ఇది 25వ సినిమా. ఇంతటి ప్రతిష్టాత్మకమైన మైలురాయి సినిమా అయినప్పటికీ, మేకర్స్ ఎక్కడా కూడా దీనిని ‘ప్రభాస్ 25’ అనే ట్యాగ్‌తో ప్రచారం చేయడం లేదు. దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా, ఫౌజి (Fauzi) లేటెస్ట్ పోస్టర్ మాత్రం అభిమానుల్లో మామూలు ఉత్సాహాన్ని నింపలేదు. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టి సాలిడ్ హిట్ సాధిస్తే, రాజాసాబ్ రిజల్ట్ ను మరిపించి ప్రభాస్ అభిమానుల్లో నూతన ఉత్సాహం కలిగించే అవకాశం ఉంది.

సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus