ఒక విషయం ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే.. చిత్రసీమలో హీరోహీరోయిన్లు, దర్శకనిర్మాతలకంటే ఎక్కువగా సంపాదించేది కమెడియన్లే. హీరోలు సంవత్సరం మొత్తం కష్టపడి రెండు సినిమాలు, హీరోయిన్లు అయిదారు సినిమాలు చేస్తే, కామెడియన్లు తక్కువలో తక్కువ 20 నుంచి 30 సినిమాలో సునాయాసంగా చేసేస్తారు. వారి వర్కింగ్ డేస్ తక్కువవ్వడమే అందుకు కారణం. ఒక కమెడియన్ సినిమాలో కనిపించేది 20 నిమిషాలైనప్పటికీ.. అతను సినిమా కోసం వర్క్ చేసేది మాగ్జిమమ్ 10 నుంచి 15 రోజులు మాత్రమే. అందుకోసం అతను తీసుకొనే పేమెంట్ కూడా రోజు లెక్కన ఉంటుంది కాబట్టి నెల తిరిగేసరికి వారి పేమెంట్ ఎవరూ ఊహించని స్థాయిలో ఉంటుంది.
ఇంత అదృష్టవంతుడైన ఒక కమెడియన్ కక్కుర్తి కారణంగా కెరీర్ ను కష్టాల్లో నెట్టుకొన్నాడు. ఆఖరి నిమిషంలో ప్రమాదం తప్పిపోయింది కానీ.. లేదంటే ఆ స్టార్ కమెడియన్ ప్రస్తుతం కటకటాల వెనుక ఉండేవాడు. అది కూడా ఒకమ్మాయి విషయంలో. నిగ్రహం లేని ఒక బలహీన క్షణంలో ఓ హీరోయిన్ కావాలనుకొంటున్న అమ్మాయిపై అడ్వాంటేజ్ తీసుకోడానికి యత్నించాడట సదరు స్టార్ కమెడియన్. అవకాశాల్లేక లోంగే అమ్మాయి అయితే ఆ స్టార్ కమెడియన్ పక్కలోకి వెళ్లిపోయేదేమో.. కానీ అమ్మడు ఫైనాన్షియల్ గానే కాక సోషల్ గానూ బాగా సెటిల్డ్ కావడంతో.. కొట్టినంత పని చేసి ఇష్యూ పోలీసుల దాకా వెళ్ళేంత హడావుడి చేసిందట. మధ్యలో పెద్దలు దూరి ఇష్యూ సీరియస్ అవ్వకుండా భారీ మొత్తం ఖర్చు చేసి సెటిల్ చేసి విషయం బయటకి పొక్కకుండా సైలెంట్ చేసేశారు.