మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు రోడ్డు కెక్కిన సంగతి తెలిసిందే. మీడియాలో కూడా హాట్ టాపిక్ అయ్యాయి. మంచు మనోజ్, అతని తండ్రి మోహన్ బాబు(Mohan Babu) ..లు ఒకరిపై మరొకరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోవడం, తర్వాత మనోజ్ (Manchu Manoj) మీడియా ముందుకు వచ్చి తన బాధని వెల్లగక్కడం జరిగింది. అయితే గొడవ ఎక్కడ మొదలైంది అనే విషయాన్ని మనోజ్ రివీల్ చేసింది లేదు. ఆ తర్వాత జల్ పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి మనోజ్ వెళ్లడం..
Manchu Manoj
అతని వెనకాలే మీడియా కూడా వెళ్లడం, ఈ క్రమంలో మోహన్ బాబు ఆవేశంతో ఊగిపోయి ఓ రిపోర్టర్ ని మైక్ తీసుకుని కొట్టడం.. తర్వాత పోలీసులు ఎంటర్ అయ్యి సిట్యుయేషన్ ని కంట్రోల్ చేయడం జరిగాయి. ఈ క్రమంలో మోహన్ బాబు, మంచు మనోజ్, మంచు విష్ణు (Manchu Vishnu),..లకు పోలీసులు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ‘మీ ఫ్యామిలీ గొడవలు రోడ్డు మీదకి తెచ్చి అల్లర్లు చేయకండి’ అంటూ మంచు ఫ్యామిలీని పోలీసులు హెచ్చరించడం జరిగింది.
వెంటనే విష్ణు, మోహన్ బాబు..లైసెన్స్డ్ గన్స్ ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం కూడా అందరికీ తెలిసిన సంగతే. అయితే మొత్తానికి.. వీరి ఫ్యామిలీ గొడవకి హ్యాపీ ఎండింగ్ పడినట్టు టాక్. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. మనోజ్ నిన్న ఓ ప్రెస్ మీట్ పెట్టాలి. కానీ మోహన్ బాబు సన్నిహితుల, అలాగే ఇండస్ట్రీ పెద్దల నుండి అతనికి ఫోన్ వచ్చినట్లు తెలుస్తుంది. ‘సామరస్యంగా సమస్యని పరిష్కరించుకుందాం?’ అని చెప్పడంతో మనోజ్ కూడా తగ్గి..
ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తుంది. మరోపక్క మంచు లక్ష్మీ (Manchu Lakshmi) కూడా మోహన్ బాబుకి అన్ని సమస్యలని అర్థమయ్యేలా వివరించినట్లు తెలుస్తోంది. ఇక మనోజ్ తల్లి నిర్మలా దేవి కూడా మోహన్ బాబుకి విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడంతో ఆయన కూడా తగ్గారని సమాచారం. వినయ్ వల్ల ఏర్పడిన సమస్యలను కూడా మోహన్ బాబు గుర్తించారని.., హాస్పిటల్ నుండి ఆయన డిశ్చార్జ్ అయిన అనంతరం పెద్దల సమక్షంలో కుటుంబ సభ్యులతో ఓ సమావేశం ఏర్పాటు చేసి.. ఈ సమస్యలను పరిష్కరించాలని డిసైడ్ అయినట్టు స్పష్టమవుతుంది.