టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) పుట్టినరోజు వేళ అనేక మంది ప్రముఖులు, అభిమానులు అతనికి శుభాకాంక్షలు తెలిపారు. ఇండస్ట్రీకి చెందిన రామ్ చరణ్ (Ram Charan) నుంచి పలువురు సెలబ్రిటీల వరకు రానాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా రానాకు సమంత (Samantha) చేసిన ప్రత్యేక పోస్ట్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. సమంత తన సోషల్ మీడియా అకౌంట్ లో రానాకు విషెస్ తెలియజేస్తూ, ‘‘హ్యాపీ బర్త్ డే మై డియర్ రానా.
Samantha, Rana:
నువ్వు ఏ పని చేసినా 100% ఎఫర్ట్ పెట్టడం నాకు ఎంతో ఇష్టం. నీ నిరంతర కృషి నన్ను ప్రతి విషయంలో మరింత బాగా చేయాలని ప్రేరేపించింది. నీకు ఎప్పటికీ అభిమానినే. దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ నీతో ఉండాలి’’ అంటూ పోస్ట్ చేసింది. సమంత ఈ పోస్ట్ ద్వారా రానాపై ఉన్న గౌరవాన్ని చూపించడమే కాకుండా, అతనితో ఉన్న స్నేహాన్ని మరోసారి రుజువు చేసింది. రానా, సమంత గతంలో కొన్ని సినిమాల్లో కలిసి నటించారు.
వీరిద్దరి మధ్య స్నేహం అక్కినేని కుటుంబంతో సమంత సంబంధం ఉన్న సమయంలో మరింత బలంగా మారింది. నాగ చైతన్యతో విడాకులు అనంతరం, అక్కినేని ఫ్యామిలీతో సంబంధాలు ఆగిపోయినా, రానాతో సమంత స్నేహం మాత్రం అలాగే కొనసాగుతోంది. రానా గురించి సమంత ఎన్నో సందర్భాల్లో గొప్పగా చెప్పడం, అతనిపై ఉన్న గౌరవాన్ని పరోక్షంగా వ్యక్తపరచడం తెలిసిందే. సమంత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రానా మీద సమంత చూపిస్తున్న ఈ అనుబంధం చూసి నెటిజన్లు ఆసక్తిగా చర్చిస్తున్నారు. ‘చైతన్యతో విడాకుల తర్వాత కూడా వీరిద్దరి స్నేహం ఇంత బలంగా ఉందంటే, అది నిజమైన అనుబంధమే.. అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇటీవలే సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరించిన సమంత, ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. రానా పుట్టినరోజు సందర్భంగా ఆమె చేసిన ఈ పోస్ట్, వారి మధ్య ఉన్న ప్రత్యేక బంధానికి ప్రతీకగా నిలిచింది.