బుల్లితెర యాంకర్ గా కొనసాగుతున్నటువంటి వారిలో రష్మిక ఒకరు. ఈమె ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని కూడా ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బుల్లితెరపై సుధీర్ రష్మీ జోడీకి భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరు కూడా నిజజీవితంలో ఒక్కటైతే బాగుంటుందని అభిమానులు భావించారు. కానీ రష్మీ మాత్రం తనకు కాబోయే వాడిని పరిచయం చేసి అందరికీ షాక్ ఇచ్చారు.
రష్మీ పెళ్లి పార్టీ అంటూ ఇటీవల ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం డిసెంబర్ 31 నైట్ ప్రసారం కానుంది. అయితే ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రోమోలు విడుదల చేశారు. తాజాగా మరొక ప్రోమో అని కూడా విడుదల చేశారు ఇందులో భాగంగా హైపర్ ఆది రష్మీ నీ పెళ్ళన్నావు కాబోయే వ్యక్తి ఎలా ఉంటాడు ఏంటి మాకు పరిచయం చేయొచ్చు కదా అంటూ అడుగుతారు.
ఆది ఇలా అనడంతో రష్మీ (Rashmi) చాలా సిగ్గుపడుతూ ప్రతి అమ్మాయికి కూడా తనకు కాబోయే భర్త ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎన్నో కోరికలు ఉంటాయని చెబుతూ ఉండగానే వెనుక నుంచి ఒక వ్యక్తి స్టేజ్ పైకి వచ్చారు. అతనిని చూస్తే ఆరడుగుల హైటు క్లీన్ షేవ్ పిల్లి కళ్ళతో చూడటానికి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. అతనిని చూసి రష్మీ తెగ సిగ్గు పడిపోవడమే కాకుండా తనని పెళ్లి చేసుకోబోయేవాడు అంటూ చెప్పారు.
ఈ విధంగా రష్మీ తనకు కాబోయే వాడిని పరిచయం చేయడమే కాకుండా వీరిద్దరూ కూడా ఒకరి కళ్ళల్లోకి మరొకరు చాలా ప్రేమగా చూసుకుంటూ లీనమైపోయారు. ఇది చూసినటువంటి ఎంతోమంది రష్మీ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి సుధీర్ కంటే చాలా అందంగా ఉన్నారు అంటూ ఇద్దరు మధ్య వ్యత్యాసాలను గమనిస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసి సుదీర్ ఫ్యాన్స్ ఎంతో బాధపడుతున్నారని కూడా తెలుస్తుంది. మరి నిజంగానే రష్మి ఇతనిని పెళ్లి చేసుకోబోతుందా లేకపోతే ఫ్రాంక్ అంటూ ఏదైనా ట్విస్ట్ ఇస్తారా అంటూ మరికొందరు కూడా ఈ ప్రోమో పై కామెంట్లు చేస్తున్నారు.
డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!