టాలీవుడ్ ఇండస్ట్రీలో గత మూడు నెలల్లో హిట్టైన సినిమాలు ఇవే?

  • April 2, 2024 / 10:41 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతి అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం పెరుగుతోంది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఈ సినిమాలలో హిట్టైన సినిమాలను మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. సర్కారు నౌకరి అనే చిన్న సినిమాతో ఈ ఏడాది మొదలైంది. జనవరి 1న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.

ఆ తర్వాత వారం ప్రేమకథ, రాఘవరెడ్డి, డబుల్ ఇంజిన్ సినిమాలు రిలీజయ్యాయి. ఈ సినిమాలు కూడా ఫ్లాపయ్యాయి. సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో గుంటూరు కారం (Guntur Kaaram) కమర్షియల్ హిట్ గా నిలిస్తే హనుమాన్ (Hanu Man) మూవీ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. సైంధవ్ (Saindhav) మూవీ ఫ్లాప్ కాగా నా సామిరంగ (Naa Saami Ranga) హిట్ అనిపించుకుంది. రిపబ్లిక్ డే కానుకగా కెప్టెన్ మిల్లర్ (Captain Miller) రిలీజ్ కాగా ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఫిబ్రవరి నెలలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్ కాగా ఆ సినిమాల్లో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (Ambajipeta Marriage Band) మాత్రమే హిట్ గా నిలిచింది.

ఈగల్ యావరేజ్ రిజల్ట్ ను అందుకోగా లాల్ సలాం (Lal Salaam) మూవీ ఫ్లాప్ గా నిలిచింది. ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona) సినిమాకు ఫస్ట్ వీకెండ్ వరకు కలెక్షన్లు బాగానే వచ్చినా ఆ తర్వాత ఆశించిన రేంజ్ లో కలెక్షన్లు రాలేదు. ఫిబ్రవరి మూడో వారంలో విడుదలైన సినిమాల్లో ఏ సినిమా కూడా ఆకట్టుకోలేదు. మార్చి నెలలో రిలీజైన సినిమాలలో ఆపరేషన్ వాలంటైన్ (Operation Valentine) నిరాశపరచగా మహా శివరాత్రి పండుగ కానుకగా గామి, భీమా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విడుదలయ్యాయి.

ఈ సినిమాలలో గామి (Gaami) సినిమా హిట్ గా నిలిస్తే భీమా (Bhimaa) సినిమా షాకిచ్చింది. అదే వారం విడుదలైన ప్రేమలు కూడా హిట్ గా నిలిచింది. శ్రీవిష్ణు (Sree Vishnu) ఓం భీమ్ బుష్ (Om Bheem Bush) సినిమాతో అబవ్ యావరేజ్ రిజల్ట్ అందుకున్నారు. మార్చి చివర్లో విడుదలైన టిల్లు స్క్వేర్ (Tillu Square) మూవీ కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus