Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

ఫిబ్రవరి 17, 2016.. ఈ రోజున భారతీయ కుర్రాళ్లు చాలా మంది ఎప్పుడూ లేనట్లుగా ఉదయాన్నే నిద్ర లేచారు. బ్రష్‌, స్నానం, తిండి కూడా మానేసి కంప్యూటర్లు/ ల్యాప్‌ టాప్‌లు ఉన్నవాళ్లు ఆన్‌ చేసేసి.. లేనివాళ్లు నెట్‌ సెంటర్ల దగ్గర, స్మార్ట్‌ ఫోన్లు ఉన్న వాళ్లు వాటిల్లో బ్రౌజర్‌ ఓపెన్‌ చేసి రిఫ్రెష్‌ చేస్తూనే ఉన్నారు. ఆపరేషన్‌ సక్సెస్‌ పేషంట్‌ డెడ్‌ అనేలా.. అందరి ప్రయత్నాలు బాగానే జరిగినా.. ఫలితం అయితే రాలేదు. 90స్‌ కిడ్స్‌కి ఇదంతా ఎందుకు గురించో అందరికీ తెలుసు. ఆ తర్వాత తరాలకు తెలియదు.

Freedom 251

ఇదంతా ఫ్రీడమ్ 251 స్కామ్ గురించే. స్మార్ట్ ఫోన్స్ యుగం మొదలవుతున్న రోజులు అవి. రూ.251కే అన్ని ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ ఫోన్ ఇస్తామన్న ప్రకటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి పేమెంట్‌ చేసి ఫోన్‌ కొనేద్దాం అనుకుంటూ కొంతమంది డబ్బులు కూడా కట్టారు. చివరకు ఎవరికీ ఫోన్ రాలేదనుకోండి. ఇదే ‘ఫ్రీడమ్‌ 251’ స్కామ్‌. దీన్నిప్పుడు ‘ఆజాదీ 501’ పేరుతో వెబ్‌సిరీస్‌లా తెరకెక్కించారు. ఇప్పుడా సిరీస్‌ ఆహాలో స్ట్రీమ్‌ అవ్వనుంది.

ఆహా ఓటీటీ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందిన ఈ ఒరిజినల్ సిరీస్‌ గురించి కొన్ని రోజుల క్రితం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. జూలై 29 నుండి స్ట్రీమ్‌ అవుతుందని తాజాగా ఓటీటీ టీమ్‌ పేర్కొంది. కొత్త పోస్టర్‌ సంగతి చూస్తే.. డిజిటల్ రివల్యూషన్, స్మార్ట్ ఫోన్ @ 501 అనే పేపర్ క్లిప్పింగ్ కనబడుతోంది. ఇదంతా చూస్తుంటే ‘ఫ్రీడమ్ 251’ను ‘ఆజాదీ 501’ చేశారన్నమాట. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ, హిందీలో ఆజాదీ అని అంటారనే విషయం తెలిసిందే. వంశీ రంగిశెట్టి దర్శకత్వం వహించిన ‘ఆజాదీ 501’ను రచనా రెడ్డి ములుముడి నిర్మించారు.

బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus