Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

‘కొత్త బంగారు లోకం’ సినిమాతో టాలీవుడ్‌లో క్యూట్ కపుల్‌ అనే ట్యాగ్‌ లైన్‌ పొందారు వరుణ్‌ సందేశ్‌, శ్వేత బసు ప్రసాద్‌. ఆ తర్వాత కూడా ఇద్దరూ ఒక సినిమాలో కనిపించినా అందులో ఆమెది అతిథి పాత్రనే. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించింది లేదు. ఆమె వివిధ కారణాల వల్ల సినిమాలకు, టాలీవుడ్‌కి దూరమైపోయింది. వరుణ్‌ సందేశ్‌ వరుస సినిమాలు చేస్తున్నా విజయాలు అయితే సాధించలేకపోతున్నాడు. అయితే ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఇద్దరూ కలసి ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్నారు.

Varun Sandesh and Shweta Basu

‘కొత్త బంగారు లోకం’ అంటూ 2008లో వరుణ్‌ సందేశ్‌, శ్వేతా బసు ప్రసాద్‌ కాంబినేషన్‌ తొలిసారి తెలుగుతెరపైకి వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ సందేష్ (బాలు), శ్వేతా బసు ప్రసాద్ (స్వప్న) కాలేజీ విద్యార్థులుగా నటించారు. వీరి మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆ తర్వాత ‘ప్రియుడు’ అనే సినిమాతో 2011లో వచ్చారు. వరుణ్ సందేష్, ప్రీతికా రావు ప్రధాన పాత్రల్లో నటించిన ఆ సినిమాలో శ్వేతా బసు ప్రసాద్‌ది అతిథి పాత్ర.

ఇప్పుడు ఈ ఇద్దరూ ‘నా వైఫ్‌ మిస్సింగ్’ అనే వెబ్‌ సిరీస్‌ ద్వారా ఓటీటీ ప్రేక్షకులను అలరించనున్నారు. ఆహాలో త్వరలోనే ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సిరీస్‌ గ్లింప్స్‌ను ఆదివారం విడుదల చేశారు. బ్యాంకులో పనిచేసే బాలు (వరుణ్ సందేశ్) అనే వ్యక్తి.. తన భార్య కనిపించట్లేదని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేస్తాడు. ఇంతకీ ఆమె ఏమైంది? బాలునే హత్య చేశాడా? లేదంటే ఆమె ఎవరితోనైనా వెళ్లిపోయిందా? అనే కథాంశంతో ఈ సిరీస్‌ను రూపొందింది.

‘కొత్త బంగారు లోకం’ సినిమా రిఫరెన్స్‌లో ఈ సినిమాలో ఉంటాయి అని అర్థమవుతోంది. ఎందుకంటే ఆ సినిమాలోని పేరు ఈ సినిమాలోనూ హీరోకు పెట్టారు. ఆ లెక్కన ఈ సిరీస్‌లో హీరోయిన్‌ పేరు స్వప్ననే అవ్వొచ్చు అనిపిస్తోంది. ఆ వివరాలు త్వరలో తెలుస్తాయి.

 సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus