Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

అక్టోబర్ 9న విడుదల కాబోతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. నిన్న హైదరాబాద్, దసపల్లా హోటల్‌లో ‘నారాయణమ్మా’ సాంగ్ లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. పాట అంత ఆసక్తికరంగా లేదు. పైగా కాపీ ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకొందరు ‘రాములో రాములా’ సాంగ్‌తో కంపేర్ చేసి ఆ స్థాయిలో లేదంటున్నారు. సాంగ్ రెస్పాన్స్ సంగతి పక్కనపెట్టేద్దాం.

Thaman

కానీ, ఈ సాంగ్ విషయంలో లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రికి, సంగీత దర్శకుడు తమన్‌కి(Thaman) మధ్య చిన్నపాటి వివాదం నెలకొన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఈవెంట్‌లో వీరి వైఖరి ఉండటం గమనార్హం. వీరి వద్దకు యాంకర్ వచ్చినప్పుడు తమన్.. రామజోగయ్య శాస్త్రి ప్రస్తావన తీసుకువస్తే, అటు పక్కనే ఉన్న రామజోగయ్య శాస్త్రి కొంచెం ఇరిటేట్ అయినట్టు ఎక్స్‌ప్రెషన్స్ పెట్టారు. ఆ తర్వాత ఈవెంట్‌లో ఆయన పెద్దగా మాట్లాడింది లేదు. ఆయన స్పీచ్ 2 నిమిషాల లోపే ఉంది.

ఇక తమన్ స్పీచ్ ఇస్తున్న క్రమంలో.. “రామజోగయ్య శాస్త్రి గారు ‘తమన్ గారు’ అన్నారంటే వెనకాల చాలా కక్ష పెట్టుకున్నట్టు అర్థం..! ఏవైనా మాటలు ఆయనకి వినిపించకపోతే లిరిక్‌లో ఆయన ‘తమన్ గారు’ అంటారు. మాకెందుకు ఆ గార్లు. స్టిల్ నేను చాలా బాధపడ్డాను, హెవీ అయిపోయింది” అంటూ తమన్ మాట్లాడుతుంటే.. రామజోగయ్య శాస్త్రి నెత్తి కొట్టుకోవడం, ఇబ్బంది పడటం మనం గమనించవచ్చు. టెక్నికల్ టీమ్ మధ్య ఇలాంటి క్రియేటివ్ డిఫరెన్సెస్ కామనే.

కాకపోతే వీళ్ళు బహిరంగంగా తమ అసంతృప్తిని బయటపెట్టారు అనుకోవాలి అంతే..! ఇక సోషల్ మీడియాలో సాంగ్ పెద్దగా వైరల్ అవ్వడం లేదు. కానీ ఈ పాటకి ఈవెంట్‌లో హీరో వెంకటేష్, ముగ్గురు హీరోయిన్లతో స్టేజిపై వేసిన డ్యాన్స్ మూమెంట్స్ మాత్రమే వైరల్ అవుతున్నాయి.

సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus