థియేటర్లలో విడుదలైన రెండు నెలలో, ఒక నెల రోజుల తర్వాత ఓటీటీల్లో సినిమాలు వచ్చేవి. ఆ తర్వాత ఆ గ్యాప్ 14 రోజులుకు పడిపోయింది. అయితే ఇది కొన్ని సినిమాలకు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ గ్యాప్ మరీ తగ్గి వారానికి వచ్చేసింది. థియేటర్లలో బొమ్మపడి వారం గడిచిన వెంటనే సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆ ఘనత సాధించిన చిత్రం ‘గాలి సంపత్’. అవును గత శుక్రవారం థియేటర్లకు వచ్చిన ‘గాలి సంపత్’ ఈ వారం మొబైల్లోకి వచ్చేస్తోంది.
రాజేంద్ర ప్రసాద్, శ్రీవిష్ణు, లవ్లీ సింగ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘గాలి సంపత్’. ఈ నెల 12న సినిమా థియేటర్లలో విడుదలైన ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. అందుకేనేమో వారానికే అంటే ఈ నెల 19కే సినిమాను ఓటీటీలో తీసుకొచ్చేస్తున్నారు. సినిమా విడుదలైన వెంటనే ఫలితంతో సంబంధం లేకుండా ఓటీటీల్లోకి తీసుకొచ్చేస్తే అంతోకొంతో డబ్బులు వెనకేసుకోవచ్చు అనేది చిత్రబృందం, ఓటీటీ టీమ్ ఆలోచనలా కనిపిస్తోంది. అన్నట్లు చెప్పలేదుగా ‘గాలిసంపత్’ వచ్చేది ఆహాలో.
‘గాలి సంపత్’ వారానికే ఓటీటీకి వచ్చేస్తున్న నేపథ్యంలో టాలీవుడ్లో మరో మాట కూడా వినిపిస్తుంది. ఈ ట్రెండ్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందని అంటున్నారు. చాలా చిన్న సినిమాలు ఈ స్టయిల్లో థియేటర్లో విడుదల చేసి.. ఓ వారానికి ఓటీటీలోకి వచ్చేయాలని చూస్తున్నాయట. మరి ఆ సినిమాలేంటి… ఎప్పుడొస్తాయనేది వేచి చూడాలి.
Most Recommended Video
శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!