Gaalivaana Teaser: సైలెన్స్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోన్న ‘గాలివాన’!

ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ5’ ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లతో వీలక్షకుల మనసులు దోచుకుంటుంది. ప్రతి నెలా జీ5 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ రిలీజ్ లతో తెలుగులో నెంబర్ ఓటీటీగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, అన్నపూర్ణ స్టూడియోస్ నుండి ‘లూజర్’, ‘సంకెల్లు’ వంటి హిట్ సిరీస్ తర్వాత మరో సిరీస్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతోంది.

Click Here To Watch Now

బిబిసి స్టూడియోస్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో నిర్మించిన యురోపియన్‌ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి ‘గాలివాన’ అనే ఒరిజినల్‌ సిరీస్‌గా నిర్మిస్తోంది. శరన్ కొప్పిశెట్టి ఈ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ కి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. టీజర్ ని బట్టి ఇదొక మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే సిరీస్ అని తెలుస్తోంది. సన్నివేశాలను చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు.

బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్ తోనే టీజర్ ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. టీజర్ తోనే మేకర్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఈ సినిమాలో రాధికా శరత్‌ కుమార్‌, డైలాగ్ కింగ్ సాయి కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, శరణ్య ప్రదీప్, అశ్రిత, అర్మాన్ మరియు నందిని రాయ్, తాగుబోతు రమేష్‌, కీలక పాత్రలు పోషిస్తున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!


ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus