Gaddalakonda Ganesh: 6 ఏళ్ళ ‘గద్దలకొండ గణేష్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

తమిళంలో సిద్దార్థ్, బాబీ సింహా కాంబినేషన్లో రూపొందిన ‘జిగర్తాండ’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అదే సినిమా ‘చిక్కడు దొరకడు’ పేరుతో తెలుగులోకి కూడా డబ్ అయ్యింది. కానీ తెలుగు వెర్షన్ ను ఆడియన్స్ అంతగా చూడలేదు. దీంతో అందులోని సోల్ ను తీసుకుని బాగా డెవలప్ చేసి ‘గద్దలకొండ గణేష్’ గా తీశాడు దర్శకుడు హరీష్ శంకర్. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాతో అథర్వ మురళి టాలీవుడ్ కి డెబ్యూ ఇచ్చాడు.

Gaddalakonda Ganesh

మొదట ఈ సినిమాకి ‘వాల్మీకి’ అని పేరు పెట్టారు. కానీ అది కాంట్రోవర్సీ కావడంతో రాత్రికి రాత్రి ‘గద్దలకొండ గణేష్’ గా పేరు మార్చి రిలీజ్ చేశారు. ’14 రీల్స్ ప్లస్’ బ్యానర్ పై అనిల్ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన ఈ చిత్రం… ఈ సెప్టెంబర్ 20 తో 6 ఏళ్ళు పూర్తిచేసుకుంటుంది. ఈ నేపథ్యంలో క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 8.74 cr
సీడెడ్ 3.45 cr
ఉత్తరాంధ్ర 2.66 cr
ఈస్ట్ 1.61 cr
వెస్ట్ 1.51 cr
కృష్ణా 1.42 cr
గుంటూరు 1.83 cr
నెల్లూరు 0.89 cr
ఏపీ + తెలంగాణ 22.11 cr
రెస్ట్ అఫ్ ఇండియా 1.96 cr
ఓవర్సీస్ 1.08 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 25.15 cr (షేర్)

‘గద్దలకొండ గణేష్’ చిత్రం రూ.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో రూ.25.15 కోట్ల షేర్ ను రాబట్టింది. పోటీగా పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పటికీ.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ అనిపించుకుంది.

సుజిత్ డైరెక్షన్ టీం కనుక నేను డైరెక్షన్ చేసినప్పుడు ఉండుంటే.. రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus