OG: సుజిత్ డైరెక్షన్ టీం కనుక నేను డైరెక్షన్ చేసినప్పుడు ఉండుంటే.. రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు

పవన్ కళ్యాణ్ మోస్ట్ హైప్డ్ మూవీ ‘ఓజి’ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బదులు మ్యూజిక్ కాన్సర్ట్ ను ఈరోజు ఎల్.బి.స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ ‘ఓజి’ గెటప్లో ఎంట్రీ ఇచ్చి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీకి లాల్ బహదూర్ స్టేడియం షేక్ అయ్యింది. అలాగే పవన్ కళ్యాణ్ స్పీచ్ కూడా హైలెట్ గా నిలిచింది.

OG

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “నేను డిప్యూటీ సీఎం అనే సంగతి మర్చిపోయేలా చేశారు దర్శకుడు సుజిత్, సంగీత దర్శకుడు తమన్. వాళ్ళు నన్ను అన్నీ మర్చిపోయేలా చేశారు. మీరు కూడా అదే కోరుకున్నారు. డిప్యూటీ సీఎం ఇలా కత్తి పట్టుకుని వస్తే ఊరుకుంటారా చెప్పండి. ఏదో సినిమాల్లో కాబట్టి సరిపోయింది. సుజిత్ నాకు వీరాభిమాని. అతను నా ‘జానీ’ సినిమా రిలీజ్ అయ్యాక నెల రోజుల వరకు ఆ బ్యాండ్ తీయకుండా అలానే ఉన్నాడు.

తర్వాత వాళ్ళ అమ్మ గారు తిడితే తీశాడు. ‘సాహో’ తర్వాత అతన్ని నా దగ్గరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తీసుకొచ్చారు. అలాంటి యంగ్ డైరెక్టర్ తో పనిచేస్తే బాగుంటుంది అని చెప్పారు. వాస్తవానికి సుజిత్ కథ చెబుతున్నప్పుడు ఏమీ అనిపించదు. కానీ తీస్తున్నప్పుడు అతని సత్తా తెలుస్తుంది. అతని స్క్రీన్ ప్లేని సంగీత దర్శకుడు తమన్ చాలా బాగా అర్ధం చేసుకున్నాడు.ఈ సినిమాకి నేను కాదు వాళ్లిద్దరే స్టార్లు.

సుజిత్ డైరెక్షన్ టీం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. యంగ్ అండ్ టాలెంటెడ్ టీం. అలాంటి టీం కనుక నేను డైరెక్షన్ చేసినప్పుడు ఉండుంటే.. నేను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు. ‘ఓజి’ అన్ని అడ్డంకులు దాటుకుని సెప్టెంబర్ 25న విడుదల కాబోతుంది. ట్రైలర్ డిఐ అవ్వక డిలే అయ్యింది” అంటూ చెప్పుకొచ్చారు.అలాగే ప్రియాంక అరుళ్ గురించి మాట్లాడుతూ.. ‘సినిమాలో లవ్ స్టోరీ కాసేపే ఉంటుందని అయినప్పటికీ చాలా బాగుంటుందని’.. ప్రత్యేక పాత్ర చేసిన శ్రేయా రెడ్డి ‘శివంగి’ అంటూ పవన్ కళ్యాణ్ ప్రశంసించారు.

మూడేళ్లుగా ఓ ప్రాజెక్ట్‌ కోసం పని చేస్తున్న మనోజ్‌.. దాని ప్రత్యేకతేంటో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus