రాంచరణ్ (Ram Charan) , దర్శకుడు శంకర్ (Shankar) కాంబినేషన్లో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకి (Dil Raju) భారీ నష్టాలు మిగల్చడం ఖాయం అయిపోయింది. అయితే ఇంకా ఎక్కువ థియేటర్లలో రన్ అవుతున్నప్పటికీ మినిమమ్ షేర్స్ ని కూడా రాబట్టలేకపోతుంది.
మూడో వీకెండ్ తో దాదాపు ‘గేమ్ ఛేంజర్’ రన్ ముగిసినట్టే అని చెప్పుకోవాలి. ‘గేమ్ ఛేంజర్’ 15 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 19.24 cr |
సీడెడ్ | 10.42 cr |
ఉత్తరాంధ్ర | 10.40 cr |
ఈస్ట్ | 6.28 cr |
వెస్ట్ | 4.11 cr |
కృష్ణా | 5.31 cr |
గుంటూరు | 6.26 cr |
నెల్లూరు | 3.61 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 65.63 cr |
కర్ణాటక | 4.91 cr |
తమిళనాడు | 3.64 cr |
కేరళ | 0.26 cr |
ఓవర్సీస్ | 14.10 cr |
నార్త్ | 14.34 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 102.88 cr (షేర్) |
‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రూ.250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.255 కోట్లు షేర్ ను రాబట్టాలి. 15 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమాకు రూ.102.88 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.152.12 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.