రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్ డీల్ విషయంలో లెక్కలు మారాయని తెలుస్తోంది. మొదట దిల్ రాజు ప్రముఖ సంస్థకు 22 కోట్ల రూపాయలకు ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను విక్రయించడం జరిగింది. అయితే రిలీజ్ డేట్ ఆలస్యం కావడం వల్ల ఆ సంస్థ ఈ సినిమా రైట్స్ విషయంలో వెనక్కు తగ్గింది.
అదే సమయంలో పెద్ద సినిమాల ఓవర్సీస్ హక్కుల లెక్కలు మారుతున్న నేపథ్యంలో మరో ప్రముఖ సంస్థకు 27 కోట్ల రూపాయలకు ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను విక్రయించాలని నిర్మాత భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. దేవర సినిమా ఓవర్సీస్ రైట్స్ ను సైతం 27 కోట్ల రూపాయలకు విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ విషయాలు తెలిసిన నెటిజన్లు దేవర గేమ్ ఛేంజర్ సేమ్ టు సేమ్ అని కామెంట్లు చేస్తున్నారు.
గేమ్ ఛేంజర్ మూవీ ఓవర్సీస్ డీల్ విషయంలో ఎన్నో లెక్కలు ఉన్నాయని సమాచారం అందుతోంది. నిర్మాత దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగేలా నిర్మాత ప్లానింగ్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శంకర్ వల్లే ఈ సినిమా ఆలస్యం అవుతుండగా అద్భుతమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని దిల్ రాజు నమ్ముతున్నారు. త్వరలో గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!