Gargi OTT: గార్గి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవికి ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ సాయిపల్లవి కెరీర్ ను కొనసాగిస్తున్నారు. తాజాగా సాయిపల్లవి నటించిన గార్గి మూవీ థియేటర్లలో విడుదలైంది. క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. సాయిపల్లవి అభిమానులకు ఈ సినిమా బాగా నచ్చింది. అయితే టాక్ కు తగిన స్థాయిలో ఈ సినిమాకు కలెక్షన్లు మాత్రం రావడం లేదు.

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన సోనీ లివ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. జూన్ లోపు ఈ సినిమా ఓటీటీ డీల్ జరిగి ఉంటే నాలుగు వారాల తర్వాత ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని ఈ నెలలో ఓటీటీ డీల్ జరిగి ఉంటే మాత్రం 50 రోజుల తర్వాతే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గార్గి చిత్ర యూనిట్ నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

మరోవైపు విభిన్నమైన కథాంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నందుకు సాయిపల్లవిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అయితే సాయిపల్లవి కొత్త ప్రాజెక్ట్ లను మాత్రం వేగంగా ప్రకటించడం లేదు. స్టార్ హీరోలకు జోడీగా సాయిపల్లవికి ఆఫర్లు రాకపోవడం కూడా అభిమానులను ఎంతగానో బాధ పెడుతుండటం గమనార్హం. గార్గి సినిమా థియేటర్లలో హిట్టైనా కాకపోయినా ఓటీటీలో మాత్రం హిట్టవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సాయిపల్లవి ఒక్కో సినిమాకు రెండు కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సాయిపల్లవికి అవకాశాలు తగ్గుతున్నాయని కొంతమంది నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సాయిపల్లవి టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు వస్తే ఆ ఆఫర్ల విషయంలో సాయిపల్లవి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus