Kalki 2898 AD: మీకు నచ్చింది చూపిస్తారా? పురాణాలను వక్రీకరిస్తారా? గరికపాటి ఫైర్‌.!

పురాణాలు, ఇతిహాసాల్లోని అంశాలు.. ప్రస్తుత తరానికి అర్థమయ్యేలా? చురుకు పుట్టించి అర్థం చేసేలా మాట్లాడుతుంటారు ప్రముఖ వక్త, ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు. గతంలో చాలా విషయాల్లో మాట్లాడిన ఆయన ఇప్పుడు ప్రభాస్ (Prabhas)  – నాగ్‌ అశ్విన్‌ల (Nag Ashwin)   వెయ్యి కోట్ల రూపాయల సినిమా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)  గురించి మాట్లాడారు. భారతంలో ఉన్నది వేరే.. తీసింది వేరే అంటూ మండిపడ్డారు. ఇప్పటికప్పుడు కర్ణుడు, అశ్వథ్థామ హీరోలు అయిపోయారు.. ఆలస్యమైందా? అచార్య పుత్ర అంటూ ఓ డైలాగ్‌ కూడా రాశారు.

Kalki 2898 AD

కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తే ఏది పడితే అది రాసేవాళ్లున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు భారతంలో కర్ణుడు ఎప్పుడూ అశ్వథ్థామను కాపాడలేదు.. అశ్వథ్థామే కర్ణుడ్ని కాపాడతాడు. అని ‘కల్కి’ మేకర్స్‌ను కడిగిపారేశాడు గరికపాటి. మన సినిమా ప్రపంచంలో రామాయణ, మహాభారతాలను భ్రష్టు పట్టించడం, తప్పుదోవ పట్టించడం కొత్తేమీ కాదని చెప్పిన గరికపాటి… నందమూరి తారక రామారావు కాలం నుంచి ఇలానే జరుగుతోంది అని చెప్పారు. దీంతో ఈ విషయంలో చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి.

సినిమా అనేది ఎంటర్‌టైన్‌ చేయాలి అనే ఆలోచనతో వాస్తవాలే చూపించాలన్న నియమం పక్కన పెట్టారు అనిఇ అంటున్నారు. క్రియేటివ్ ఫ్రీడమ్‌ పేరిట తమకు నచ్చిన, తెలిసిన విషయాన్ని సినిమాల్లో చూపిస్తున్నారు అంటూ పాత చిత్రాలను కూడా ప్రస్తావిస్తున్నారు మరికొందరు. గతంలో వచ్చిన పౌరాణిక గాధలు వాస్తవికతకు ఆమడ దూరంలో ఉంటాయి అని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో నాగ్‌ అశ్విన్‌ కూడా అలానే సినిమాను తీశారు అని చెబుతున్నారు. సినిమాటిక్‌ లిబర్టీ వాడారు అని కూడా అంటున్నారు.

అయితే పౌరాణిక పాత్రలను వాడి కథలు మార్చేయడం సరికాదు అనే విమర్శలూ వినిపిస్తున్నాయి. అశ్వథ్థామ, కర్ణుడు ఇలా మారిపోవడం.. భారతంలోని వీరులైన అర్జునుడు, ధర్మరాజు, భీముడు లాంటి వారు సినిమాలో ఎక్కడా లేకపోవడం అలా జరిగినవే అని చెబుతున్నారు. అయితే, మరి దీనికి సమాధానం సినిమా టీమ్‌ నుండి వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విమర్శల నేపథ్యంలో రెండో పార్టులో భారతాన్ని చూపించే విషయంలో జాగ్రత్త పడతారా? లేక ఇలానే చేస్తారా? అనేది చూడాలి.

సౌత్‌లో రీసెంట్‌గా రిలీజ్‌ అయిన ట్రైలర్‌ ఏంటి? శంకర్‌ ఎవరిని అన్నారు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus