ఈవారం ఎలిమినేషన్ అయ్యింది అతడే..! బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే.,

  • December 2, 2023 / 09:04 PM IST

బిగ్ బాస్ హౌస్ లో ఈవారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. గౌతమ్ కృష్ణ హౌస్ నుంచీ ఎలిమినేట్ అయిపోయినట్లుగా సమాచారం తెలుస్తోంది. 5వ వారం తర్వాత గౌతమ్ కృష్ణ ఫేక్ ఎలిమినేట్ అయి సీక్రెట్ రూమ్ కి వెళ్లాడు. ఆ తర్వాత 2.ఓ అశ్వత్ధామ అంటూ రీ ఎంట్రీ ఇచ్చాడు. రావడమే శివాజీ గ్రూప్ ని టార్గెట్ చేస్తూ నామినేట్ చేశాడు. తనకి ఇచ్చిన స్పెషల్ పవర్ తో సందీప్ ని సేఫ్ చేశాడు. ఆ తర్వాత ఇప్పటివరకూ కూడా తన గేమ్ తో సోలోగా గేమ్ ఆడుతూ నెట్టుకుంటూ వచ్చాడు.

శివాజీని ప్రతివారం టార్గెట్ చేస్తూ ఏదో ఒక రూపంలో నామినేట్ చేస్తూ వచ్చాడు. అంతేకాదు, సాధ్యమైనంత వరకూ యావర్ ని అలాగే పల్లవి ప్రశాంత్ లని కూడా టార్గెట్ చేశాడు. స్పై బ్యాచ్ ని టార్గెట్ చేస్తూ ప్రియాంకవైపు మళ్లాడు. సిస్టర్ సెంటిమెంట్ అంటూ గేమ్ లో చాలాసార్లు తనకి ఫేవర్ గా గేమ్ ఆడాడు. ఆమెని కెప్టెన్ గా కూడా చేశాడు. ఇక 13వ వారం ఇంటి నుంచీ వెళ్లక తప్పలేదు.గౌతమ్ కృష్ణ 2.ఓ గా రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత గేమ్ లో తన పవర్ ని చూపించాడు.

కానీ, స్పై బ్యాచ్ ని టార్గెట్ చేయడం వల్ల సోషల్ మీడియాలో తనకి గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. నిజానికి గతవారమే ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. కానీ, డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా రతిక ఇంకా అశ్విని ఇద్దరూ ఎలిమినేట్ అయి గౌతమ్ సేఫ్ అయ్యాడు. కానీ, ఈవారం ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. అసలు ఎలిమినేషన్ రౌండ్ లో ఏమైందంటే.,శనివారం ఎపిసోడ్ లో గౌతమ్ కి ఫుల్ గా క్లాస్ పడింది. ప్రియాంకని కెప్టెన్ చేశావ్, ప్రియాంక చెప్పిందని పాయింట్స్ అమర్ కి ఇచ్చావ్. ఇది తప్పు కానప్పుడు శివాజీ పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తే ఏమైంది ? యావర్ కి హెల్ప్ చేస్తే ఏమైందని నాగార్జున క్లాస్ పీకారు.

అంతేకాదు, ప్రతి వారం శివాజీతో ఏంటి నీకసలు ప్రాబ్లమ్ అంటూ నిలదీశారు. దీంతో గౌతమ్ శివాజీ గేమ్ గురించి పూర్తిగా చెప్పాడు. కానీ, ఎలాంటి ప్రూఫ్ లేకపోవడం పార్షియాలిటీ చూపించాడు అనేది నిరూపించలేకపోయారు. దీంతో గౌతమ్ వీకండ్ బాగా డల్ అయ్యాడు. ఇక ఫైనల్ గా శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున కేవలం అర్జున్ ని మాత్రమే సేఫ్ చేసి పినాలేకి పంపించారు. మిగతా వాళ్లని ఆదివారం ఎపిసోడ్ లో సేఫ్ చేస్తూ వచ్చారు. చివరగా శోభాశెట్టి ఇంకా గౌతమ్ మాత్రమే ఉన్నప్పుడు సీరియల్ బ్యాచ్ చాలా టెన్షన్ పడింది.

గౌతమ్ ఎలిమినేట్ అనగానే హౌస్ మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యింది. ప్రియాంక అయితే చాలాసేపు బాధపడింది. చివరి వరకూ బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ ఇస్తాడేమో అని ఆశగా పార్టిసిపెంట్స్ ఎదురుచూశారు. అంతేకాదు, పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ ఫ్రీపాస్ వాడతాడేమో అని హోస్ట్ నాగార్జున అడిగారు. కానీ, పల్లవి ప్రశాంత్ ఎవ్వరి కోసం పాస్ ని వాడలేదు. దీంతో గౌతమ్ ఇంకా శోభాశెట్టి ఇద్దరూ కూడా లీస్ట్ లో ఉండిపోయారు. ఎలిమినేషన్ రౌండ్ ని ఎదుర్కున్నారు. ఇద్దరిలో గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యాడు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus